Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మీ, షాధీముభారక్ పథకాలతో పేద కుటుంబాలకు భరోసా లభించిందని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవిందనాయక్ అన్నారు. బుదవారం రెవిన్యూ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ వై శ్రీనివాసులు అద్యక్షతన జరిగిన కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గోవిందనాయక్, ఏటూరునాగారం డివిజన్ ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ వలియాబీలతో హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అంతకుముంతు తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లా డుతూ మండలంలోని మంగపేట, నర్సాపురం బోరు, బుచ్చంపేట, కోమటిపల్లి, కమలాపురం, చెరుపల్లి, మల్లూరు, రాజుపేట గ్రామపంచాయతీలకు చెందిన 37 మంది అర్హలకు కళ్యాణలక్ష్మీ పథకం చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. అందులో 37 దళిత 4 గిరిజన కుటుంబాలకు రూ.37 లక్షల4వేల92 విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్ధార్ జె మల్లేశ్వరరావు, ఆర్ఐ కుమారస్వామి, నంద కిషోర్, సొసైటీ డైరెక్టర్ నర్రా శ్రీధర్, నాయకులు, రెవెన్యూ సిబ్బంది, లబ్దిదారులు పాల్గొన్నారు.