Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ ఆధ్వ ర్యంలో మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె సురేందర్ రెడ్డి తెలిపారు. రేపు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్య టించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని, ప్రతి కార్యక్రమం వద్ద కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయా ప్రాంతాల్లో నియ మించిన పోలీసు అధికారులు, సిబ్బంది, నిర్దేశిత విధులు, పూర్తిస్థాయిలో పకడ్బందీగా నిర్వహించా లని ఆదేశించారు. నేడు మంత్రులు పర్యటించే ఘన పురం, భూపాలపల్లిలోని ప్రతి ప్రాంతాన్ని బుధవారం ఆయనర పరిశీ లించి, పోలిస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. కాన్వారు, హెలి పాడ్ బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, బహిరంగ సభ బందోబస్తు ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చారు. అంతకు ముందు మంజుర్ నగర్ లోని ఇల్లందు క్లబ్ లో మంత్రుల బందోబస్తుకు సంబంధించిన సమా వేశం నిర్వహించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ప్రజల పార్కింగ్ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అదనపు ఎస్పి వి శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు రాములు, రామ్ మోహన్ రెడ్డి, భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి, రిజర్వు, సీఐ రంజిత్ రావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు సంతోష్, సతీష్ పాల్గొన్నారు.
హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలన
గణపురం : గణపురం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి. కల్వకుంట్ల తారక రామారావు రాక కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడి, అడిషనల్ కలెక్టర్ దివాకర పరిశీలించారు. అనంతరం తాహసిల్దార్ కార్యాలయానికి చేరుకొని కార్యాలయ ప్రారంభ ఏర్పాట్లు పరిశీలించారు. అక్కడి నుండి గాంధీనగర్ గ్రామంలో ప్రారంభించనున్న కస్తూర్బా బాలికల హాస్టల్ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం చెల్పూర్ శివారు సింగరేణి 1000 క్వార్టర్సులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు కేటీఆర్ హైదరాబాదు నుండి నేరుగా మండల కేంద్రానికి హెలిక్యాప్టర్లో మండల కేంద్రా నికి వస్తాడని అన్నారు. ముందుగా తాహ సిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడి నుండి గాంధీనగర్ గ్రామంలోని కస్తూర్బా బాలికల పాఠ శాలను ప్రారంభిస్తారన్నారు. అనంతరం సింగరేణి క్వార్టర్స్ ప్రారంభిస్తారని తెలిపారు. ఆర్డీవో శ్రీనివాస్. డీపీఓ ఆశాలత, తహసిల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో అరుంధతి, ఈవోపీఆర్ది హరిచంద్రరెడ్డి, సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్గౌడ్. బీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు పొలుసాని లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
నేడు గణపురం మండల కేంద్రానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా పరిశీలించారు. ముందుగా హెలిప్యాడ్ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంతంలో ఉండా ల్సిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీ లించి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం గాంధీనగర్ గ్రామంలోని బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు.
జయప్రదం చేయాలి : ఎంపీపీ
శాయంపేట : భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో గురువారం నిర్వహించ నున్న మంత్రి కేటీఆర్ బహిరంగ సభకు మండలం నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధి గ్రామాలలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారం భోత్సవాల్లో కేటీఆర్ పాల్గొంటున్నారని అన్నారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంటుందని, విజయవంతం చేయాలన్నారు.