Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని, రాబోయే రోజుల్లో పార్టీని అధిక మెజార్టీతో గెలిపిం చాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వ హించారు. అనంతరం బస్టాండ్ కూడలి వద్ద కార్నర్ మీటింగ్లో ఆయన మా ట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివద్ధి తప్ప ఈ తొమ్మిది సంవ త్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒరిగిందేమీ లేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే ఉన్నాయని, ఇప్పటి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని విమ ర్శించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికా రంలోకి వచ్చి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. రెండవసారి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మొండి చేయి చూపాడని మండిపడ్డాడు. హరితహారంతో పోడు భూము లను ధరణితో వ్యవస్థను రద్దు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తు న్నారన్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ అధికారం చేపట్టినప్పటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీ మారిన నాయకులు ఉన్నారన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను తరిమికొట్టడానికి ప్రజలంతా ఏకం కావాల న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్లే కార్యక్రమాలపై మేనిఫెస్టో వివరించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోయి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం వివిధ పార్టీల నుండి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరగా వారికి కండువాలు కప్పి సాదారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు,ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య,కాంగ్రెస్ నాయకులు,వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.