Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లికి బైపాస్ రోడ్డు మంజూరు : ఎమ్మెల్యే గండ్ర
నవతెలంగాణ-భూపాలపల్లి
ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీలలో భాగంగా ఇప్పటికే అనేక నిధు లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, చెప్పిన విధంగానే జిల్లాకు మెడికల్ కాలేజీతోపాటు తాజాగా భూపాలపల్లికి బైపాస్ రోడ్డు మంజూరైందని, దీంతో జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం సులువు అవుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వికలాంగుల కార్పొ రేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతితో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తర్వాత భూపా లపల్లి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. జిల్లాలో ఇప్పటికే అనేక నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తాజాగా భూపాలపల్లికి బైపాస్ రోడ్డు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని బాంబుల గడ్డ నుండి కాసింపల్లి మీదుగా మోరంచపల్లె వరకు సుమారు 14 కిలోమీటర్ల వ్యవధిలో రూ.29 కోట్ల60లక్షలతో భూమి సేకరణ, రూ.85 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపడతా మన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి, ఎంపీపీ లావణ్య సాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, జిల్లా నాయకులు కళ్లెపు రఘుపతిరావు, సాంబమూర్తి, స్థానిక కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.