Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని లింగాల గ్రామపంచాయతీ పరిధి ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు గురువారం స్థానిక తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్‌కు హౌ సైడ్ పొజిషన్ సర్టిఫికెట్ (భూమి యజమాని సర్టిఫికెట్) ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ఒడ్డుగూడెం లో ఇల్లు లేని పేద ఆదివాసి గిరిజనులకు ఇండ్లు ని ర్మిస్తామని తెలపడంతో, హౌ సైడ్ పొజిషన్ సర్టి ఫికెట్ ఇవ్వాలని తాసిల్దార్‌ను కోరారు. తాసిల్దార్ ముల్కూరు శ్రీనివాస్ స్పందించి నిరుపేదలైన ఆదివాసి గిరిజనులకు వెంటనే భూమి యజమాని సర్టిఫికెట్లను ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళ అధ్యక్షురాలు చేల శాంత, 20 మంది ఆదివాసి మహిళలు తదితరులు పాల్గొన్నారు.