Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తాడ్వాయి
పగిడిద్దరాజు జాతర పోస్టర్ను గురువారం పగిడిద్దరాజు పూజారి అర్రెం లచ్చు పటేల్, మేడారం లోని వనదేవత సన్నిధిలో సమ్మక్క పూజారి సిద్ధ బోయిన స్వామి, పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, ఎండోమెంట్ జూనియర్ అసిస్టెంట్ బాలకష్ణ సిబ్బంది, పూజారుల ఆధ్వర్యంలో పగిడిద్దరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సమ్మక్క వన దేవత అయిన భర్త పగడి ద్దరాజు జాతర అర్రెం వంశీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డలో మార్చి 1 నుంచి 3 వరకు నిర్వహిస్తున్నారని అన్నారు. సంద ర్శకులు జాతరకు అధిక సంఖ్యలో విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, డైరెక్టర్ యానాలసిద్దిరెడ్డి, పాక రాజేందర్, ఎండోమెంట్ సిబ్బంది మాదారి పుల్లయ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు.