Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
సంపూర్ణ అంధత్వ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మచ్చాపూర్ గ్రామ సర్పంచ్ రేగురి రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని మచ్చాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. డాక్టర్ సుకుమార్ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం సజావుగా సాగుతోందన్నారు. కంటి వెలుగు ద్వారా అవసరమైన వారికి కంటి ఆపరేషన్ చేయడంతోపాటు ఉచితంగా కళ్ళ అద్దాలు, మందులను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు జిల్లా ఇన్చార్జి, ములుగు జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నాలుగు రోజులపాటు కంటి పరీక్షలు చేస్తారన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులు వంగరి ప్రభాకర్,నాలుగో వార్డ్ మెంబర్ లెంకల రమేష్, పంచాయతీ కార్యదర్శి స్వాతి, పృథ్వీరాజ్ ఉట్ల, ఉపసర్పంచ్ చంద్రమౌళి, ఏఎన్ఎం వెంకట నరసమ్మ, ఎం సుమలత, అల్వాల కనకయ్య, నరసయ్య, చెన్నూరి శివకృష్ణ, వైద్య సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.