Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజక ఇన్చార్జి ఇందిర
నవతెలంగాణ-జనగామ డెస్క్
ప్రభుత్వ ఆస్తుల్ని అంబానీ, అదానీలాంటి బడా వ్యాపార వేత్తలకు బీజేపి ప్రభుత్వం అప్పనంగా కట్టబెడుతూ, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కు తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజక వర్గ ఇంచార్జీ సింగపురం ఇందిర అన్నారు. నియో జకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పెరుగుతున్న ధరలు, నిరు ద్యోగంపై ప్రజల దృష్టి మరల్చేందుకు చూస్తుందని దుయ్యబట్టారు. మోడీ ఆప్తులకు ప్రజా సంపదను కట్టబెట్టారని విమర్శించారు. ప్రభుత్వమొండి వైఖరిపై పార్లమెంట్లో కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీ, ఖర్గే లు ప్రస్తావించినప్పటికీ సమా ధానం ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం మోడీది అన్నా రు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎస్బీఐలు పూర్తిగా కుప్పకూలాయని, విమానాశ్రయం, ఓడరేవు, రక్షణ, విద్యుత్ శాఖ కాంట్రాక్టర్లు గుత్తాధిపతులకు కట్టబెట్టారని విమర్శించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పక తప్పదన్నారు. ఎల్ఐసీ, ఎస్బీఐలు సంస్థలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.