Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
భూపాలపల్లి జిల్లాకు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు గురువారం విచ్చేసిన బీఆర్ఎస వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు వినతులు అధికమొత్తంలో సమర్పించారు. భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిణి రాకనేష్ కేరాఆర్ను మర్యాద పూర్వకంగా కలిసి కాటారం సబ్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జయశంకర్ జిల్లా మలహర్రావు, కాటారం, మహదేవ పూర్, పలిమేల, మహాముత్తరం మండలాలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధంచిన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఉపాధి ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయాలి
నవతెలంగాణ-గణపురం
గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయాలని ఉపాధి హామీ ఉద్యోగుల జాక్ కమిటీ చైర్మన్ యస్‌కె జమీర్ పాష, అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోరే కుమార్ స్వామి, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ జిల్లా అధ్యక్షుడు విఠల్ దుబాసి, జాక్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శ్రీనివాస్‌రావు, టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం నాయకులు శ్రావణ్ కుమార్ కోరారు. గురువారం తహసిల్దార్ కార్యాల యం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతిపత్రం అందిం చారు. గ్రామీణాభివృద్ధి శాఖలో 20 సంవత్సరాలు నుండి పనిచేస్తున్న ఉపాధి ఉద్యోగులకు పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టెక్నికల్ అసిస్టెంట్ నవ్య రాజశ్రీ, మౌనిక రామచందర్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఎంపీల సమస్యల పరిష్కరించాలి
తహసిల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు గురువారం ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చాగంటి లక్ష్మీనా రాయణ, మండల అధ్యక్షుడు కూతురు రమణ, కార్యదర్శి నడిగోటి రాములు ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందించారు. ఆర్ఎంపీలకు పారా మెడికల్ శిక్షణ ఇవ్వాలని తెలుపగా స్పందించిన కేటీఆర్ ఆర్ఎంపీల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆర్ఎంపీలు వెంకన్న, కర్రు రఘుపతి, ధనంజయ, దౌడు రమేష్, శివ, అన్వర్, శంకర్, సాంబశివుడు, సంతోష్‌కుమార్, విద్యాసాగర్, సుధాకర్, శశిధర్, నగేష్, శ్రీనివాస్, అంజి, సంధ్య పాల్గొన్నారు.
కేటీఆర్ సభకు తరలిన మహిళలు
నవతెలంగాణ-మహదేవపూర్
భూపాలపల్లి జిల్లాలో గురువారం రాష్ట్రం మున్సి పాలిటీ మంత్రి కేటీఆర్ సభకు మహాదేవపూర్ మండలం నుండి 200మహిళా గ్రూప్ సభ్యులతో పాటు బీఆర్ఎస్ నాయకులు సభకు తరలి వెళ్లారు. మండలంలోని మహిళా గ్రూపులకు రూ.కోటి పది లక్షలు బ్యాంకు లీకేజ్ కింద చెక్కులు మంజూరు చేశారు. అదేవిధంగా 40 లక్షల శ్రీనిధి కింద మహిళా గ్రూపులకు కేటీఆర్ చేతుల మీదగా చెక్కులు ఇచ్చారని ఎంపీపీ రాణిబారు, ఐకేపీ ఏపీఎం రవీందర్ తెలిపారు.