Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-చిట్యాల
మండలంలోని దూత్పల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జెడ్పీటీసీ గొర్రె సాగర్ గురువారం ప్రారంభించారు. అంధుల రహిత రాష్ట్రమే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సర్పంచ్ పులి వెంకటేష్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఏరుకొండ గణపతి, గ్రామ శాఖ అధ్యక్షులు రాజగోపాల్రావు, నాయకులు కాట్రేవుల కుమార్, వైద్యులు మౌనిక, మహేశ్వరి, డీలర్, అంగన్వాడీ టీచర్స్, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.