Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనాధగా మారిన పాప...
- సంబంధిత వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయాలి
- గ్రామస్తులు, సర్పంచ్ గుర్రం రమా సమిరెడ్డి డిమాండ్
నవతెలంగాణ-తాడ్వాయి
వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆదివాసి గిరిజన బాలింత మతిచెందిందని గ్రామస్తులు, సర్పంచ్ గుర్రం రమా సమిరెడ్డి, కుటుంబ సభ్యులు ఆరోపించారు. గురు వారం వారు తెలిపిన వివరాల ప్రకారం... ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట పరిధి నీలాలతోగు గొత్తికోయ గూడెంకు చెందిన గర్భిణి మడకం జ్యోతికి పురిటి నొప్పులు రాగా 12 రోజుల క్రితం(ఈనెల ఫిబ్రవరి 11న) ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత బాలింతకు తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్య సిబ్బంది పట్టించు కోలేదు. పెద్ద ఆపరేషన్ అయిన ఆమెకు కుట్లు ఇప్ప కుండా, కేసీఆర్ కిట్టు ఇవ్వకుండా. డిశ్చార్జి చేయకుం డానే ఇంటికి పంపించారు. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురికాగా బంధువులు, సర్పంచ్ ఫిర్యాదు మేరకు మళ్లీ వైద్యం చేయించడానికి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందు తూ గురువారం మతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యానికి మృతురాలి పసిబిడ్డ అనాధగా మారింది. ఆమెకు దిక్కెవరు అని గ్రామస్తుల రోధనలు మిన్నంటాయి. సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకుని మతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. ఏది ఏమైనా ములుగు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం పెరిగిపోతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మంది గిరిజనులు ఉన్న ములుగు జిల్లాకు వైద్యపరంగా అధిక ప్రాధాన్యత ఇచ్చి మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.