Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతా అమలు కావాలంటే కేసీఆర్ నాయకత్వా న్ని దేశ ప్రజలంతా కోరు కుంటున్నారని స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య అన్నారు. గురువారం మండల పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభిం చారు. ఎంజీఎన్ర్ఈజీఎస్ నిధుల నుండి రఘునాథ్‌పల్లి గ్రామంలో రూ.50 లక్షలతో, తిడుగు గ్రామంలో రూ.30లక్షలతో తిమ్మంపేట గ్రామంలో రూ.20 లక్షలతో పంచా యతీ భవనం, మండల కేంద్రంలో రూ.20 లక్షలతో పంచాయతీ భవనం, ముగ్ధుమ్ తండా లో రూ.20 లక్షలతో, తమ్మడపల్లి జిలో రూ.20 లక్షలతో, హిమ్మత్ నగర్లో రూ.15 లక్షలతో అభివృద్ధి పను లకు శంకుస్థాపనలు చేసి ప్రారంభించారు. మహిళ సంఘాలకు రూ.100 కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళా దినోత్సవం రోజున ఇవ్వబోతున్నామని తెలిపారు. 75 గజాలు ఇంటి స్థలం ఉంటే రూ.3 లక్షలు మహిళల పేరున ఉగాది పండుగ రోజున ఇస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఉచిత కరెంట్ ఇవ్వడం లేదని, ఒక్క తెలంగాణాలో అమలు చేస్తు న్నామన్నారు. 27న మంత్రి కేటీఆర్ షోడాషాపల్లి వస్తున్నారని, ఘన స్వాగతం పలకాలన్నారు. ఇప్పటికి కోటి గోర్లు పంపిణీ చేశామన్నారు. మిగతా వారికి కూడా త్వరగా పంపిణీ చేసామన్నారు. కేసీఆర్ దేశ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో గ్రామాలను అభవృద్ధి చేస్తున్నారన్నారు. రైతుబంధు ద్వారా రైతులకు ఏటా ఎకరానికి రూ.10000 పెట్టుబడి సాయం అందిస్తున్నారన్నారు. రూ.5లక్షల రైతుబీమా 24 గంటల ఉచిత విద్యుత్, తదితర సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. దీంతో రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. దళితబంధు పథకాన్ని విడుతల వారీగా నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ రాజు, వైస్ ఎంపీపీ కనకయ్య, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కడారి శంకర్, పీఆర్ఓ పసునూరి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, మార్కెట్ మాజీ డైరెక్టర్ ఎడ్ల రాజు, సర్పంచులు వంద మల్లయ్య, బల్లెపు వెంకట నర్సింగారావు, ఎంపీటీసీలు జ్యోతి రజిత యాకయ్య, ఇల్లందుల స్రవంతి మొగిలి, మాదారం రజిత, చిలువేరు శివయ్య, సర్పంచ్ లక్ష్మీ స్వామి నాయక్, తాటికాయల అశోక్, ఎంపీటీసీ నీలమ్మ సోమిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ తాటికాయల వరుణ్, సర్పంచ్ గండి మల్లికాంబ రమేష్, మహిళా మండల అధ్యక్షురాలు గోలి కవిత, మార్కెట్ డైరెక్టర్ రాజకుమార్, సర్పంచ్ పొన్నాల జ్యోతి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.