Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ విధానాలను ప్రతిఘటించాలి
- బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణవ్యాప్త ప్రచారం
- మార్చి 17న హనుమకొండలో భారీ బహిరంగ సభ
- ఆల్ ఇండియా కార్యదర్శి సీతారాం ఏ చూరి రాక
- రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-మహబూబాబాద్
బీజేపీ ప్రజా కంటక ప్రధాని మోదీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తం గా మార్చి 17 నుండి 30 వరకు మూడు బస్సు జాతల ద్వారా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించను న్ననట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. గురువారం స్థానిక పెరు మాళ్ళ జగన్నాథం భవన్లో నిర్వహించిన పార్టీ జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేదలు, కార్మికుల గురించి కాకుండా కార్పొరేట్లకు అ నుకూలమైన విధానాలను అవలంభిస్తోందన్నారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని, అంబానీలకు కట్టబెడుతోందన్నారు. ఆదాని కుంభకోణంతో దేశ సంపద అంతా ఆవిరైందని, ఎల్ఐసీ, ఎస్బిఐ సంస్థల లో పెట్టిన ప్రజల సొమ్ము అంతా పోయిందని అన్నారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఐడి దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుందని అన్నారు. కేంద్ర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు నిధులను తగ్గించిందని ఉపాధి హామీ, ఎరువులు, గ్యాస్ సబ్సిడీలను తగ్గించి వాటి ధరలను పెంచిందని వీరభద్రం అన్నారు. ఇదే సందర్భంగా పెట్టుబడిదారులకు పన్నులు తగ్గిం చి పేదలపై భారాలు మోపిందన్నారు. బీజేపీని ఓడించే శక్తులకు రాబోయే కాలంలో సీపీఐ(ఎం) మద్దతు ఉం టుందని అన్నారు. ప్రస్తుతం ఓట్ల గురించి సీట్ల గురించి కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) పోరాడుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై మార్చి 17నుండి 30వ తేదీ వరకు మూడు బస్సు జాతాల ద్వారా ప్రచార నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి జాత 17న హనుమకొండలో ప్రారంభమ వుతుం దని, పార్టీ అఖిలభారత కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారని తెలిపారు. 17న సాయంత్రం మహబూబాబాద్ లో బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. 13 జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తుందని అన్నారు. రెండోవ జాత నిర్మల్ జిల్లా నుండి ప్రారంభమై పది జిల్లాలు తిరుగుతుదని, మూడవ జాత నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుండి ప్రారంభమై మరో 10 జిల్లాల్లో జాతా నిర్వహి స్తున్నట్టు తెలిపారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తామని తెలిపారు. ఈ సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సుర్ణపు సోమయ్య, ఆకుల రాజు, గుని గంటి రాజన్న, శెట్టి వెంకన్న, కందునూరు శ్రీనివాస్, గాడిపల్లి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.