Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-భూపాలపల్లి
బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి యువత మోసపోవద్దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.297.32 కోట్ల విలువైన పలు పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిని కుర్చీలో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కషి చేయాలని సూచించారు. అనంతరం ఏర్పాటుచేసిన యువకుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత పాత్ర కీలకమని అన్నారు. రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసానిచ్చారు. జిల్లాలోని పార్టీ నాయకులందరూ ప్రతిరోజు పార్టీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు కార్యకర్తలకు యువతకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, బీఆర్ఎస్ అర్భన్ అద్యక్షుడు కటకం జనార్ధన్ పటేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, కౌన్సిలర్లు మాడ కమల లక్ష్మారెడ్డి, మేకల రజీత మల్లేష్, ముంజాల రవీందర్, పానుగంటి హరీక శ్రీనివాస్, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి మాజీ పట్టణ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.