Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అట్టహాసంగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు
- రూ.297.32 కోట్ల పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్య క్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో గురువారం జరిగిన రాష్ట్ర ఐటీ,పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా సాగింది. జిల్లాలో రూ.297.32 కోట్ల విలువైన పలు పనులను ప్రారంభించి, మరికొన్ని పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహిళా శిశు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీని వాసరెడ్డి, మధుసూదన్చారితో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ముందుగా రూ.కోటి20లక్షలతో నిర్మించిన ఘనపురం తహసిల్దార్ కార్యాలయాన్ని, రూ.4 కోట్లతో నిర్మించిన బీసీ బాలికల గురుకుల పాఠ శాలను ప్రారంభించి సర్వమత ప్రార్థనలు నిర్వహిం చారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కార్మికుల సౌకర్యార్థం రూ.229 కోట్లతో నిర్మించిన 994 క్వార్ట ర్లను ప్రారంభించారు. అనంతరం భూపాల పల్లిలో రూ.3కోట్లతో నిర్మించిన ఆర్అండ్బీ అతిథి గృహాన్ని, సుభాష్ నగర్ కాలనీలో రూ.14.59లక్షలతో నిర్మించిన స్ట్రీట్ వెండార్ స్టాల్స్‌ను, దివ్యాంగుల కోసం రూ.23లక్షలతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం వెలిశాల పల్లిలో రూ.33కోట్లతో నిర్మించిన 544 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. అనంతరం భూపాలపల్లి పట్టణంలో రూ.6కోట్ల80లక్షల అంచనాతో చేపట్టే మిషన్ భగీరథ పనులకు, రూ.4.5 కోట్లతో చేపట్టే మినీ స్టేడియం నిర్మాణ పనులకు, రూ.కోటితో చేపట్టే జిల్లా గ్రంధాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్, గండ్ర జ్యోతి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ డిఎస్ దివాకర్ సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
జిల్లాలో కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రుల పర్యటన ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా ఎస్పీ జే సురేందర్ రెడ్డి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం నుంచే పోలీ సులు కేటీఆర్ , మంత్రులు పర్యటించే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 1000 మందితో బందోబస్తును కట్టుదిట్టంగా నిర్వహిం చారు. గణపురంలో దిగింది మొదలు భూపాలపల్లి కార్యక్రమాలు ముగించుకొని వెళ్లే వరకు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాన్వారు, హెలిపాడ్ బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, బహిరంగ సభ బందోబస్తు సందర్భంగా1 అదనపు ఎస్పి, 9 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు 81 మంది ఎస్ఐలు, 889 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొ న్నారు. మంత్రి పర్యటన ప్రశాంతంగా ముగియ డంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా పోలీ సులతో పాటు, ఇతర జిల్లా పోలీసులు సమర్ధవ తంగా పనిచేశారని ఎస్పీ అభినందించారు. అదనపు ఎస్పి వి శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు రాములు, రామ్మోహన్‌రెడ్డి, భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి, రిజర్వు సీఐ రంజిత్ రావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు సంతోష్, సతీష్, ఎస్ఐలు కానిస్టేబుల్స్ హౌంగార్డ్స్ పాల్గొన్నారు.
కేటీఆర్‌కు ఘన స్వాగతం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి ఉదయం చేరుకున్న కేటీఆర్‌కు మంత్రులు జి.జగదీశ్వర్ రెడ్డి, దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూద నాచారి, టీబీజీకేస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు, బస్వరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర, జెస్సీ స్వర్ణలత, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ కేతిరి వాసుదేవరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, కాటారం పిఏసీఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి,నాగుర్ల వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పుష్ప గుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డలో ఏర్పాటుచేసిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తిరుగు పయానమయ్యారు. ఎమ్మెల్యే గండ్ర దంపతులు కృజ్ఞతలతో కేటీఆర్‌కు వీడ్కోలు పలికారు.