Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నడికూడ
మండల కేంద్రంలోని నాలుగో అంగన్వాడి సెంటర్ చూడముచ్చటగా పిల్లలకు ఆహ్లాదకరంగా ఉందని డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సబిత అన్నారు. గురువారం నడికుడ మండలంలోని నాలుగో అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లో పిల్లలకు ఉపయోగపడే విధంగా గోడలకు బొమ్మలు వేయడం వారికి విషయ పరిజ్ఞానం కోసం కూరగాయలు, పండ్లు, జంతువులు, ఇతరత్రా బొమ్మలు వేయడంతో అంగన్వాడి సెంటర్ కు కొత్త కళ వచ్చిందని, దాని వలన పిల్లల కూడా నైపుణ్యాలు పెరుగుతాయని అన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు సంబంచిన బుక్స్ కొనడం వాటి వలన పిల్లలకు పఠాణ శక్తి కి ఉపయోగపడుతుందని, విద్యార్థులకు టెలివిజన్ లాంటి పరికరాలను అమర్చి మంచినీటి వసతి కల్పించినందుకు అంగన్వాడి సెంటర్ ను మాడ్రన్ అంగన్వాడి సెంటర్ గా ఉందని అభినందించారు. అంగన్వాడి సెంటర్కు ఎస్బిఐ జిల్లా యజమాన్యం ఎస్బిఐ పరకాల వారు చేసిన సహకారానికి వారికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఊర రవీందర్రావు, సిడిపిఓ భాగ్యలక్ష్మి, అంగన్వాడి టీచర్ అనిత పిల్లలు తల్లులు పాల్గొన్నారు.