Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోపనపల్లిలో ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్డి సౌకర్యం లేక విద్యార్థినీల ఇబ్బందులు
నవతెలంగాణ-పర్వతగిరి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మనఊరు-మనబడి కార్యక్రమం నత్తనడకన సాగుతుండడంతో మూ డు నెలలుగా విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. మండలంలోని గో పనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఊరు-మనబడి కార్యక్రమంలో పాఠశాలకు అవసరమైన మౌళిక వసతులు కల్పన లో భాగంగా ప్రభుత్వం మరుగుదొడ్లు, మూత్రశా లల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు వెంటనే చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో అమలు చేసే అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పనులు పి ల్లర్లకే పరిమితమై వెక్కిరిస్తున్నాయి. గతంలో ఉన్న వాటిని కూల్చివేయడంలో చూపిన శ్రద్ధ క్షేత్రస్థాయిలో పనుల నిర్వహణలో అధికారులు, ఎస్ఎంసీ క మిటీ, ప్రజా ప్రతినిధులు చూపించక పోవడంతో ఎక్కడవేసి న గొంగళి అక్కడే అన్నరీతిలో పనులు నిలిచిపోయా యి. దీంతో విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. అంతేకాకుండా నిర్మాణ పనులకు ఉపయో గించే బండరాళ్లు, ఇసుక తదితర సామాగ్రి పాఠశాల ఆవరణలోనే ఉండడంతో విద్యార్థులు అవస్థలు పడు తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని పనులు వెంటనే పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని విద్యార్థినీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.