Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కాకతీయ మెడికల్ శాలలో అనస్తీషియా మొద టి సంవత్సరం పిజీ విద్యార్థిని వేధించి ఆత్మహత్యా యత్నం చేసుకునేలా చేసిన వైద్యుడు సైఫ్ డాక్టర్ డి గ్రీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏ బీవీపీ ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కళాశాల వద్ద పెద్దఎత్తున నిరసనను చేపట్టారు. గేటుముందు ధ ర్నా చేపట్టిన ఏబీవీపీ కార్యకర్తలను సిఐ మల్లేష్యా దవ్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు పెను గులాటలు చోటుచేసుకున్నాయి. ఆందోళన చేపడుతున్న ఏబీవీ పీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీ వీపీ నాయకుడు నిఖిల్ మాట్లాడుతూ కేఎంసీలో చదువుతూ ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న జూని యర్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ప్రయత్నానికి సీ నియర్ విద్యార్థి సైప్ కారణమన్నారు. తల్లిదండ్రులు నెలరోజుల క్రితమే కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఆత్మహత్యయత్నానికి ప్రయ త్నించి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిందని ఇలాంటి సం ఘటనలు సైఫ్ లాంటి వ్యక్తులు రాష్ట్రంలో కోకోల్లలు గా ఉన్నారని, ఆడవాల్లకు వేధింపులు రాకుండా ప్రీతి లాంటి సంఘటనలు పునరావతం కాకుండా ఉండా లంటే సైఫ్ ను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ హర్షవర్ధన్ వరంగల్ మహా నగర కార్యదర్శి సుజిత్ నాయిం, నగర జొన్నల ఇన్చార్జి మనోజ్ ఎల్బీ జోనల్ ఇన్చార్జి సిద్దు, భరత్, శ్రావణ, సాకేత్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.