Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బీ.గోపి
నవతెలంగాణ-వరంగల్
దళిత బంధు ద్వారా మొదటి విడతలో గ్రౌండింగ్ అయిన యూనిట్లను, క్షేత్ర స్థాయిలో వాటి తీరుతెన్నుల వివరాలను నమోదు చేసేందుకే తెలంగాణ దళిత బంధు యాప్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఈయాప్లో అన్ని వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి అధికారులను ఆదేశించారు. మొ దటి విడతలో దళితబంధు ద్వారా గ్రౌండింగ్ అయిన యూనిట్లపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు సరిగా ఉపయోగించుకుంటున్నారా? లేదా ? అనే విషయంపై గురు వారం వివిధ మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఆర్థికచేయూతే లక్ష్యంగా దళిత బందు ప్రా రంభించిందని దీని ద్వారా జిల్లాలో 303 యూనిట్లు గ్రౌండ్ చేశామన్నారు. గ్రౌండింగ్ అయిన యూనిట్లు దళిత కుటుంబాలు ఎలా ఉపయోగించుకుంటు న్నాయో సంబంధిత మండల అభివృద్ధి అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదికలు అందించినట్లు చెప్పారు. దళితబంధు యాప్లో దళిత బంధు గ్రౌండిం గ్ అయిన యూనిట్ల వివరాలను నమోదు చేసేందుకు సంబంధిత ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్స్కు లాగిన్ఐడి, పాస్వర్డ్ ఇవ్వడం జరిగిందని... పంచాయ తీ సెక్రటరీలు కూడా దళిత బంధు గ్రౌండింగ్ అయిన యూనిట్ల వివరాలను, ఫోటోలు,వీడియోలు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో జ రుగుతుందని మన జిల్లాలో కూడా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
రెండోవిడత దళిత బంధు లబ్ధిదారులు అప్లికేషన్స్ మీసేవ ద్వారా అప్లై చేయడానికి అవకాశం కల్పించిందని చెప్పా రు. అలాగే గ్రౌండ్ అయిన యూనిట్ల వివరాల రికార్డులను లబ్ధిదారులు సరిగా రాస్తున్నారా లేదా, రికార్డుల ద్వారానే ఎంతవరకు యూనిట్ లబ్ధి పొందారు అనే విషయాన్ని గమనించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకాడే, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ కుమార్, డిఆర్డీవో పిడి సంపత్ రావు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.