Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
- అపోలో ఆసుపత్రిలో యూత్ నేతకు పరామర్శ
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయాలపాలై సి కింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్న యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌ను గు రువారం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసానారెడ్డిలు పరామర్శించారు. అపోలో ఆసుపత్రి వైద్యులను అడిగి పవన్ ఆ రోగ్య పరిస్థితిల గురించి తెలుసుకున్నారు. ఆసుప త్రిలో ఉన్న పవన్ కుటుం బ సభ్యులను ఓదార్చి మ నోధైర్యం కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతీ రాజకీయ పార్టీ స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉన్న ఈ దేశంలో అరాచకానికి పాల్పడి రాక్షసంగా యూత్ కాంగ్రెస్ నాయకుడి పై టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని ప్రజాస్వామికవాదులు ముక్తకంఠంతో ఖండిం చాల్సిందేనన్నారు. పవన్‌పై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఈ దాడి వెనుక ఎంతటి పెద్దవారు ఉన్నా చట్టాపరమైన చర్యలు తీసుకోవా లని పోలీస్ కమిషనర్ ను డిమాండ్ చేశారు. ప్రజల మాన, ధన, ప్రాణాలను కాపాడడానికే ప్రభుత్వాలు ఉన్నాయన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం వైఫల్యం చెందితే ప్రజలు తిరగబడతారని అది ప్రజాస్వామ్యా నికి మంచిది కాదని హితవు పలికారు. ఈ ఘటనలో ప్రభుత్వము పోలీసులు పారదర్శకంగా వ్యవహరించి తోట పవన్‌పై దాడి చేసిన నిందితులపైన చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు.ఆయన వెంట యువ జన కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్, బొల్లంపవన్, అరుణ్‌రెడ్డి తదితరులు కాంగ్రె స్ నాయకులు ఉన్నారు.