Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కోల్డ్ స్టోరేజ్‌లను గురువారం మార్కెట్ అధికారులు తనిఖీ చేశారు. రైతులు మార్కెట్ కు తీసుకువచ్చే మిర్చి సరుకుకు ధర నచ్చక మార్కెట్ పరిధిలోని కోల్డ్ స్టోరేజ్ నందు నిల్వ చేసుకుంటారు. ఈ నిల్వలను గురువారం మార్కెట్ అధికారులు 8 బృందాలుగా ఏర్పడి వివిధ కోల్డ్ స్టోరేజీలలో రైతులు నిల్వచేసిన బస్తాల వివ రాలను పరిశీలించారు. సరైన రికార్డులు లేని వారికి నోటీసులు జారీ చేయాలని ఉన్నత శ్రేణి కార్యదర్శి బివి రాహుల్ అధికారులను ఆదేశించారు.