Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్పర్సన్ బిందు నాయక్, కలెక్టర్ శశాంక
నవతెలంగాణ-బయ్యారం
క్యాన్సర్ మందు లేని జబ్బు కాదని కారకా లను ముందస్తుగా గుర్తిస్తే అరికట్టగలుగుతామని తీవ్రతరమైతేనే కష్టమవుతుందని ఇది ప్రతీ ఒక్కరు గుర్తించాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. శుక్ర వారం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరో గ్య కేంద్రంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్ అనేది మం దులేని జబ్బు కాదని ముందస్తుగా గుర్తిస్తే తప్పని సరిగా అరికట్టగలుగుతామని అన్నారు. హైదరా బాదు నుండి రోటరీ క్లబ్ నిర్వాహకులు డాక్టర్ అని త కేశవరావులు ఇరువురు శిబిరం నిర్వహించడం తోపాటు క్యాంపుకు వచ్చిన రోగులకు భోజనాలు కూడా పెట్టడం అభినందనీయమన్నారు. వారి ప్రజాసేవ పట్ల అంకితభావానికి కృతజ్ఞత తెలియ జేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సం క్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ కోరిక మేర కు మహబూబాబాద్ జిల్లాలోని కురవి, బయ్యారం ప్రాంతాలలో క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాలలో అత్యధిక నిరుపేద నిరక్షరాస్యత గిరిజనులు అత్యధిక సంఖ్యలో ఉన్నందున క్యాన్సర్ సంబంధిత అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఉచితంగా క్యాంపులు ఏర్పాటు చేసి 15000 విలువ చేసే పరీక్షలను ఉచితంగా ఆయా కుటుంబాలకు అందజేసి ఆర్థికంగా ఆదుకోవాలన్నదే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే పరీక్షలు చేయించుకోవడానికి నగరానికి వెళ్లవలసి వచ్చేదని తద్వారా డబ్బు సమయం వధా అయ్యేదని ఇబ్బందులు ఎదుర్కొనే వారిని రిపోర్టులకు కూడా వెళ్లవలసి వచ్చేదని వైద్యం పొందటానికి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. ఇన్ని విపత్కర పరిస్థితులు ఉన్న ఈ క్యాన్సర్ మహమ్మారి ని ముందస్తుగా ఎదుర్కొనేందుకు మంత్రి సహకారంతో వైద్యులు ఈ ప్రాంతానికి రావడం జరిగిందని రోగులు కూడా తమ సమస్యలను విపులంగా చెప్పుకోవాలి అన్నారు. ఈ వైద్య శిబిరానికి సహకరిస్తున్న ఆశాలకు ఏఎన్ఎం లకు కలెక్టర్ ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైరపర్సన్ కు మారి ఆంగోత్ బిందు నాయక్ మాట్లాడుతూతమ మండల పరిధి 50 కిలోమీటర్ల విస్తరణలో ఉం టుందని పట్టణానికి సుదూరంగా ఉందని కనీసం సిగల్స్ కూడా సరిగా ఉండవని ప్రజలు రవాణా లేని ప్రాంతాలలో ఇబ్బందులు పడుతూ తాము సంపాదించిన డబ్బంతా రోగాలకు వెచ్చిస్తున్నారని క్యాన్సర్ వంటి ఖర్చు జబ్బులకు కుటుంబం మొత్తం నష్టపోతుందని, వైద్యులే తమ ప్రాంతానికి వచ్చి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం వై ద్యుల సేవలు మర్చిపోని వని అన్నారు. గంగారం కొత్తగూడా మండలాలలో కూడా క్యాన్సర్ స్పెలింగ్ శిబిరం ఎంత అవసరమని వైద్యాధికారులు ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవా లన్నారు. నెల రోజుల పాటు ఆశలు ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేయడం ప్రతి ఒక్కరిని ఆరోగ్యాన్ని పరీక్షించి అనారోగ్యంగా ఉన్న వారిని గుర్తించడం వారి అంకితభావానికి నిదర్శ నం అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రీజి నల్ క్యాన్సిల్ సెంటర్, హైదరాబాద్ నుండి వచ్చిన వైద్యులు, సిబ్బంది కూడా ఉచితంగా శిబిరం ఏర్పా టు చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ లను నిర్వహించడమే కాక భోజనాలు పెట్టడంతో ప్రజాసేవకు అంకితమ య్యారన్నారు. శిబిరానికి వచ్చే రోగులకు ఉచిత భో జనంతో పాటు రవాణా సౌకర్యం కల్పించినట్లు తెలియజేశారు. అమెరికా వైద్యులు డాక్టర్ శివానం ద్ మాట్లాడుతూ క్యాన్సర్ మూడు విధాలుగా ఉం టుందని నోటి క్యాన్సర్ గర్భ ముఖ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ గా ఉన్నాయన్నారు. గర్భముఖ క్యాన్సర్ ను ముందుగా గుర్తించవచ్చని తద్వారా తక్కువ ఖర్చు తో తగ్గించవచ్చన్నారు. క్యాన్సరు ఒకసారి వచ్చిన వారు ప్రతి మూడు సంవత్సరములకు పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే క్యాన్సర్ వచ్చిన వారు ఆ కుటుంబాలలో ఉంటే తప్పనిసరిగా పరీక్ష లు అవసరం అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్కు ఏ విధంగా శిక్షణ పొందాలో వైద్యులు తెలియజేస్తారన్నారు. నోటి క్యాన్సరు మగ ఆడవాళ్లకు గుట్కా పొగాకు వంటి అలవాట్ల ద్వారా వస్తుందని వాటిని నిరోధించుకొని మంచి అలవాట్లు పెంపొందిం చుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి హరీష్ రాజు, ఉపవైద్యాధికారి అంబరీష, పిఎస ఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, ఉపసర్పంచ్ వీరబోయిన కవిత, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ, డాక్టర్ రాజకుమార్, విజయ్ కుమార్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.