Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్మెట్ట
ఐక్యమత్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయ ని ఎంపీపీ గోవర్ధన్ అన్నారు. శుక్రవారం నర్మెట్ట మండలంలోని మచ్చుపహాడ్ గ్రా మంలో స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో నర్మెట్ట తరిగొప్పుల మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి తండ్రి పెద్ది సంజీవ రెడ్డి జ్ఞాపకార్థం ఉమ్మడి వరంగల్ జిల్లా సిద్దిపేట జిల్లాల 24,25,26 లో జరిగే కబడ్డి టోర్నమెంట్‌ను మచ్చు పహాడ్ క్రీడా ప్రాంగ ణంలో ఎంపీపీ గోవర్ధన్‌తో కలిసి జనగామ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కన్వీ నర్ గుజ్జ సంపత్ రెడ్డి, నర్మెట్ట జెపిటిసి శ్రీనివాస్ మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డి, మ ద్దూరు జెడ్పిటిసి కొండల్ రెడ్డి, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జనగామ జిల్లా చైర్మన్ వై.కుమార్ గౌడ్ ఒలంపిక్స్ జెండా ఆవిష్కరణ క్రీడాకారులకు దుస్తులు పం పిణీ చేసి క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్స హించాలనే లక్ష్యంతో ప్రతీ గ్రామంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేశామని తెలి పారు. అనంతరం కబడ్డీ క్రీడాకారులను పరిచయం చేసుకున్నరు. తన మనవడి తో కలిసి కబడ్డీ ఆడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివరాజు, నర్మెట్ట సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి జనగామ మున్సిపల్ చైర్మన్ పోకల జ ముల లింగయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సురేష్, సర్పం చులు కిరణ్ స్పోర్ట్స్ యూత్ అధ్యక్షులు పరశురాములు, జి రాజశేఖర్ ఆర్ రాజశే ఖర్, రమేష్ రాజు రంజిత్, క్రీడాకారులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు మాజీ ఎంపీటీసీలు, యువజన సంఘాల క్రీడాకారులు పాల్గొన్నారు.