Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
వరంగల్ కాకతీయ మెడికల్ (కేఏంసి)లో జూనియర్ విద్యార్థినిపై ర్యాగింగ్‌కు పాల్పడ్డ సీనియ ర్లను ర్యాగింగ్ నిరోధక చట్ట ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని, నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలనీ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్యప్రకాష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో సూర్య ప్రకాష్ హాజరై మాట్లాడారు. కేఎంసి పిజి మొదటి సంవత్సరం చదు వుతున్న ప్రీతి అనే విద్యార్థినిని వేధింపులకు గురి చ ేస్తూ, సీనియర్ విద్యార్థి తీవ్రమైన చిత్రహింసలకు పాల్పడ్డారని తెలిపారు. తీవ్ర మనస్థాపానికి గురైన జూనియర్ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసిందని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలకు సీనియర్ విద్యా ర్థులు పదేపదే పాల్పడుతున్న కనీసం ప్రిన్సిపాల్ ర్యా గింగ్ చట్టాలపై అవగాహన కల్పించలేదని విమర్శిం చారు. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులను హెచ్చరించే ప్రయత్నం కూడా చేయలేదని పేర్కొన్నారు. నిర్ల క్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ పై చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుసగా ర్యా గింగ్ ఘటనలు పెరిగిపోతున్నాయని, వరుసగా ఇది రాష్ట్రంలో మూడో ఘటన అని వివరించారు. ర్యా గింగ్ రక్కసిని ఎదుర్కొనేందుకు పక్కాగా చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ చట్టాలపై నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలని, విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమా వేశంలో ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు భూక్యా రాజే ష్, లక్ష్మణ్, నవీన్, ఉపేందర్, కళ్యాణ్, నరసింహ, చంటి తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్...
గార్ల : త్వరలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు ఎస్ఎఫ్ఐ అధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే టాలెంట్ టెస్ట్ జయప్రదం చేయాలని అ సంఘం డివిజన్ కార్యదర్శి సూర్య ప్రకాష్ అన్నారు. ఎస్ఎఫ్ఐ అధ్వర్యంలో మార్చి 3,4 తేదీలలో మండల,జిల్లా వ్యా ప్తంగా నిర్వహించే టాలెంట్ టెస్ట్ కరపత్రాలను స్దా నిక కస్తూరిభా పాఠశాలలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కా ర్యదర్శి మాళోతు శాంతి కుమార్ శుక్రవారం ఆవిష్క రించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వి ద్యార్థుల సమస్యల పరిష్కారానికి అనునిత్యం పోరా టాలతో ముందుకు వెళుతున్న ఎస్ఎఫ్ఐ పోరాటాల తో పాటు విద్యార్థులు చదువుల్లోనూ ముందుండా లని ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్‌లు నిర్వహిస్తుందని తెలిపారు. నూతన సిలబస్ ఆధారంగా రూపొందించబడిన ప్రశ్నాపత్రం వంద మార్కులతో అన్ని సబ్జెక్టులతో కలిపి మల్టీపుల్ ఛాయిస్ రూపంలో పరీక్ష ఉంటుందని, జిల్లాలో ఉన్న విద్యార్థులు అందరూ టాలెంట్ టెస్ట్‌ను సద్వినియో గం చేసుకోవాలని కోరారు.ఈ టాలెంట్ టెస్ట్‌లో జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులతో పాటు అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠ శాల విద్యార్థులకు ప్రత్యేక కన్సోలేషన్ బహుమతులు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులుసింహాద్రి,వెంకటేష్,వంశీ, ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు.