Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తుందని రాజమాన్ సింగ్ తండా సర్పంచ్ గుగులోత్ ప టేల్ నాయక్, వైస్ ఎంపీపీ బొమ్మె రబోయిన కల్పన రాజు అన్నారు. శుక్రవారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి పంచాయతీరాజ్ ఏఈ యుగేం ధర్‌తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. గిరిజన రిజర్వేషన్లను పెంచి, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మ హేష్, నాయకులు దుంపల జమున సమ్మయ్య, ఉపసర్పంచ్ జాటోత్ హరిసింగ్, మాజీ సర్పంచ్ బిక్యా నాయక్, వార్డ్ సభ్యులు భూక్యా మంగ్యా, గుగులోత్ వీరన్న, దేవులాల్, దేవేందర్, కమలాకర్, బాలోజీ, భూక్య హుస్సేన్ పాల్గొన్నారు.