Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ పట్టణంలో దశల వారీగా అన్ని శివారు కాలనీలకు సీసీ రోడ్లు వేయిస్తానని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలోని 30వ వార్డు శ్రీనగర్ కాలనీలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు, 13వ వార్డులో సిడిఎఫ్ ఎమ్మెల్సీ నిధులనుంచి 4.99 లక్షలతో నిర్మిం చిన రోడ్లకు ఎమ్మెల్యే భానోతు శంకర్ నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడారు. పనులు నాణ్యతగా చేయాలని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ డా.పాల్వాయి రాంమోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కౌన్సిలర్ జనార్ధన్ సంబంధించిన దండ వైన వెంకన్న గోగుల రాజు ఎడ్ల వేణుమాధవ్, కో ఆప్షన్ సభ్యులు అనిత, నిమ్మల శ్రీనివాస్, బత్తుల సారయ్య, కొండ బిక్షం కృష్ణ భద్రయ్య పాల్గొన్నారు.