Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపాలిటీ, గ్రామాల్లో స్వైర విహారం
- దాడిలో గాయపడుతున్న చిన్నారులు
- రోడ్లపైకి రావాలంటే జంకుతున్న జనం
నవతెలంగాణ-తొర్రూరు
డివిజన్ కేంద్రమైన తొర్రూరు మున్సిపాలి టీ పరిధితో పాటు అనేక గ్రామాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపు లుగా సంచరిస్తుండడంతో జనం భయాందోళ నకు గురవుతున్నారు. రోడ్లపైకి రావాలంటే జం కుతున్నారు. తొర్రూరు మున్సిపల్ పరిధిలోని 16 వార్డుల్లో, బస్టాండ్, మున్సిపల్ రోడ్డు, గాం ధీ సెంటర్, కంటాయపాలెం రోడ్డు, కూరగా యల మార్కెట్ వద్ద ప్రధాన రోడ్లపై మండల పరిధిలోని అనేక గ్రామాల్లో రాత్రి పగలు లేకుం డా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీనితో ప్రజలు, స్థానికులు, వాహనదారులు ముఖ్యం గా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర భ యాందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై, మున్సిపల్ రోడ్డులో ఏర్పా టు చేసిన చికెన్, మటన్, ఫిష్ షాపులలో వాటి వ్యర్ధాలను ఇష్టం వచ్చినట్లు రోడ్ల పక్కన షాపు యజమానులు పడి వేయడంతో వీధి కుక్కలు వాటిని తినడానికి రోడ్లపైకి వస్తున్నాయి.
400కు పైగా వీధి కుక్కలు...
ఒక్క తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోనే 400కు పైగా కుక్కలు ఉన్నాయి. ఇక గ్రామాల్లో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒంటరిగా వెళ్లేందుకు భయమేస్తుందని ప్రజలు వాపోతు న్నారు. రోడ్లపై వెళుతున్న కార్లు, ద్విచక్ర వాహ నాల వెంట పడుతూ వారిని భయాందోళనకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు.బైకులు అదుపుతప్పిన సంఘటనలు ఉన్నా యి. గ్రామాల్లో కుక్కల అరుపులకు పిల్లలు భ యపడి నిద్రపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కుక్కలు గుంపులుగా చేరి మేకలపై దాడులు చేసిన సంఘటనలు ఉన్నా యి. ఇండ్ల వద్ద పెంచుకుంటున్న నాటు కోళ్లను, కోడి పిల్లలను ఎత్తుకెళ్లి తింటున్నాయని వాపో తున్నారు. మండల పరిధిలోని 29 గ్రామాలలో అధికారిక లెక్కల ప్రకారం 935 కుక్కలు ఉన్నాయి. 2022-23 సంవత్సరం లోతొర్రూ రు మున్సిపాటీతో కలిపి 29 గ్రామాలలో 2 వేల 336 కుక్కకాటుకు గురైన కేసులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోద యినా యి. జనవరి 2023 నుండి ఇప్పటివరకు 194 కేసులు నమోదు కాగా తొర్రూరు పట్టణం లోనే 42 కేసులు నమోదైనట్లు అధికారులు తెలుపు తున్నారు. రోజుకు 10 కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.