Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 27,28న నిర్వహించే దండోరా రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని మాదిగ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొంగర శంకర్ సీనియర్ న్యాయవాది కోప్పుల శంకర్, మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షుడు దర్శనం రామకృష్ణ, పిలుపు నిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్ లో కరపత్రాలు ఆవి ష్కరించి మాట్లాడుతూ తెలంగాణలో మాదిగలకు రావలసిన న్యాయమైన వాటా సాధించటానికి కేంద్రంలో ఉన్న వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడానికి మాదిగ జాతిని సంఘటితం చేసి పోరాటం చేయడమే మార్గమని మాదిగ హక్కుల దండో రా భావిస్తుదన్నారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు జనాభా దామాషా ప్రకారం వాట కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలం గాణ పోరాటంలో అగ్రభాగాన ఉండి పోరాటం చేసి తెలంగాణ సాధించిన మాది గ జాతి బిడ్డలను దళిత బంధు ద్వారా ఆదుకోవాలని కోరారు. మాదిగలకు ప్రత్యే క కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే దళితులకు పది లక్షల రూపాయలు మంజూరు చేయాలని, రాజకీయ పార్టీల వైఖరిని ఎండగట్టి మాదిగ హక్కుల సాధన లక్ష్యంగా ఖమ్మంలో జరిగే రాష్ట్ర మహాసభలు జయప్ర దం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్. వెంకటేష్, మహంకాళి మల్ల య్య, తప్పెట్ల వీరన్న, హుస్సేన్ నాయక్, గద్దెల కృష్ణ, వడకల సాయి చందర్, దాసరి అంబరీష పాల్గొన్నారు.