Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ధన్యవాద సభ విజయవంతం చేయాలి
- ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-వేలేరు
ఈనెల 27న రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్బంగా వేలేరు మండలంలోని షోడాషపల్లి శివారులో నిర్వహించే రైతు ధన్యవాద సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వేలేరు మండలంలోని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాసంలో సభ నిర్వహణకు సన్నాహాకం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని ఎత్తైన గ్రామాలకు సాగునీరు అందించడం కోసం రూ.133 కోట్ల అంచనాతో మంజూరు అయిన మూడు లిప్ట్‌లకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పీచర క్రాస్ రోడ్డు వద్ద శంకుస్థాపన, బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.రాష్ట్ర దివ్యాంగుల చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జెడ్పీటీసీ చాడ సరిత, పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఆత్మ చైర్మన్ కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్ల ఫోరం వేలేరు మండల అధ్యక్షులు కాయిత మాధవరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మరిజె నర్సింగరావు, అధికార ప్రతినిథి ఏ రాజశేఖర్, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జన సమీకరణకు నిబద్ధతతో పని చేయాలి : ఎమ్మెల్సీ పల్లా
నవతెలంగాణ-ధర్మసాగర్
ఈనెల 27న ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఉమ్మడి మండలం షోడశపల్లి గ్రామంలో పలు అభివద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు విచ్చేస్తున్న సందర్భంగా జన సమీకరణకు ప్రతి ఒక్క కార్యకర్త, రైతు సమితి ఇన్చార్జులు, ప్రజా ప్రతినిధులు నిబద్ధతతో పనిచేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కాకతీయ పట్టణాభివద్ధి సంస్థ నిర్వాహకులు, కార్యక్రమ పరిశీలకులు సుందర్ రాజు యాదవ్‌తో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పుట్టిన ఊరు కన్నతల్లి లాంటిదని, తాను పుట్టిన సోడాషపల్లి గ్రామానికి ఎంతో కొం వేలేరు, ధర్మసాగర్ మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసేందుకు కషి చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభివద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కేవలం రాష్ట్రానికే కాకుండా దేశ రాజకీయాల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్కు శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. ఏడు మండలాల్లో మండలానికి 4వేల నుండి 5వేలమందితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఎంపీపీ నిమ్మ కవితా రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు జుబేదా లాల్ మొహమ్మద్, డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బండారు రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడ్డు ప్రభుదాస్, మండల అధ్యక్షులు సర్పంచ్ మునిగేల రాజు, రైతు సమితి మండల కన్వీనర్ సోంపల్లి కరుణాకర్, సర్పంచ్ ఎర్రబెల్లి శరత్, పెసరు రమేష్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కలిసి పనిచేస్తే ఇతరులకు డిపాజిట్లు దక్కవు
నవతెలంగాణ - స్టేషన్ఘనపూర్
బీఆర్ఎస్లో తామంతా కలిసి పనిచేస్తే ఇతర పార్టీలకు డిపాజిట్లు దక్కవని, ఏ పార్టైనా కలాస్ అవ్వడం ఖాయమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈనెల 27న మంత్రి కేటీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా చిల్పూర్ మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశంలో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొని మాట్లాడారు. చిల్పూ ర్ మండలం నుంచి 5వేల మంది, స్టేషన్ ఘన్ పూర్ మండలం నుంచి 25వందల జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివద్ధి పనులు దేశంలో ఎక్కడాలేవని అన్నారు. బీసీ ప్రధానిగా మోడీ ప్రాతినిద్యం వహిస్తున్న మంత్రి వర్గంలో బీసీలకు చోటు ఇవ్వకపోవడం దురదష్టకరమన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.