Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలవికాస ఆర్గనైజింగ్ మేనేజర్ మంజులా రెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్య సంరక్షణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని బాలవికాస ఆర్గనైజింగ్ మేనేజర్ మంజులారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చల్వాయి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోసార్ బాలవికాస కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం సర్పంచ్ వీసం సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంజులారెడ్డి హాజరై మాట్లాడారు. కెనడా ఫండ్ ఫర్ లోకల్ వారి ఆర్థిక సహాయంతో పైలట్ ప్రాజెక్ట్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 25 ట్రైబల్ పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థినిలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించారన్నారు. గ్రామంలోని కస్తూర్బాలో విద్యార్థినిలకు అవగాహన కల్పించడంతోపాటు శానిటరీ ప్యాడ్స్, బర్నింగ్ మిషన్ అందించామన్నారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో మహిళలకు పోషకాహార పదార్థాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ వసంత, సూపర్వైజర్ సుమతి, అంగన్వాడీ టీచర్లు కుసుమ కుమారి మోక్షారాణి అరుంధతి, అలివేలు తదితరులు పాల్గొన్నారు.