Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్దంగా ఉండాలి..
- రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదు
- భూపాలపల్లి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి
- గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధికారం మాటున భూకబ్జాలకు పాల్పడుతున్నాడని, పేదల పొట్టలు కొడుతూ కోట్లకు పరుగులు పెడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతి పరుడు కాదని నిరూపించుకోవడానికి భూపాలపల్లి అంబ ేద్కర్ సెంటర్లో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడిన తీరు సరిగా లేద న్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అరాచక పాలన దోపిడీని ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి పై 120 కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు. గెలిచిన పార్టీ నుండి రాజీనామా చేసి మరల ఎన్నికల బరిలో దిగిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాకముందు కేసీఆర్, కేటీఆర్ కుటుంబానికి ఆస్తులు ఎంత ఉన్నాయో ఇప్పుడు తెలంగాణను ఎంత దోచుకున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేటీఆర్ కు వందల ఎకరాలలో విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మిస్తుంటే అక్కడికి వెళ్లి ప్రశ్నించిన రేవంత్ రెడ్డిని జైలుకు పంపారని తెలిపారు. నాలుగు రోజుల క్రితం మొగుళ్లపల్లి మండలంలో రేవంత్ రెడ్డి పర్యటన నిమిత్తం ఆ సభకు రెండు రోజుల ముందే కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు. పదవుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే అక్రమ సంపాదన ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. పెట్రోల్ కల్తీ చేస్తూ జైలుకు వెళ్లలేదా అని ఎమ్మెల్యే గర్ర వెంకట రమణారెడ్డి పై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే అవినీతి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఆయన భూ బాధితులు పెరిగిపోతున్నారని అన్నారు. మంజూరు నగర్ లో 186 సర్వే నంబర్లు 39 మంది పేదల భూమిని లాక్కునే ప్రయత్నం ఎమ్మెల్యే చేస్తున్నాడన్నారు. గిద్దె ముత్తారంలో ముస్లింలకు చెందిన 400 ఎకరాల భూమిని అదేవిధంగా వరికోల్‌పల్లి, కుమ్మరిపల్లిలో సుమారు 1400 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు భూపాలపల్లి లో జరిగిన కేటిఆర్ సభనే నిదర్శనమన్నారు. పలువురు మహిళలు తమ భూములను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దౌర్జన్యంగా, అన్యాయంగా ఆక్రమించుకున్నారని గోడు వెళ్లబోసుకున్నారని గుర్తు చేశారు. ఆస్తులను కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరిన దుర్మార్గుడు ఎమ్మెల్యే అని విమర్శించారు. దమ్ముంటే రేవంత్ రెడ్డిని పోటీ చేయడం అనడం కాకుండా.. తక్షణమే ఎమ్మెల్యే రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి రావాలని, ప్రజలు చిత్తు చిత్తుగా ఒడిస్తారని అన్నారు. విప్లవాల గడ్డ భూపాలపల్లి లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంపటి భువన సుందర్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు భట్టు కరుణాకర్, ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ సమ్మయ్య నాయక్, జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య, పిప్పాల రాజేందర్, అంబాల శ్రీను, రంజిత్, రజినీకాంత్ లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.