Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశించిన సమయంలో ప్రత్యేక కార్య చరణ ద్వారా పూర్తి చేయాలని, యుద్ధప్రాతి పదికన పనులు జరగాలని రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరా బాద్ నుండి మునిసిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76 ప్రభుత్వ జిఓల ప్రకారం చేయాల్సిన క్రమబద్దీకరణ, పోడు భూములు, ఆయిల్ పామ్ సాగుపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. అనంతరం శాంతి కుమారి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు లేకుండా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, ఆబాది గ్రామకంఠం, శిఖం , వక్ఫ్, దేవాదాయ భూముల మొదలగు వివరాలను ప్రోఫార్మా-1 ప్రకారం సేకరించా మన్నారు. సదరు భూమి క్రమబద్ధీకరణ చెసేందుకు నివేదిక తయారు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు.జిల్లాలకు చేరే ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీ పూర్తి చేసి వివరాలు ఆన్ లైన్ యాప్ లో వెంటనే నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ మినహాయించి పట్టణాలలో నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం మరో 21787 లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉందన్నారు. ఆ వివరాలను మరో వారం, పది రోజుల్లో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలన్నారు. అర్హత సాధించిన దరఖాస్తులు పట్టా సర్టిఫికెట్లు సిద్దం చేసామని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు సమయం తీసుకుని పంపిణి పూర్తి చేయాలన్నారు. జీఓ 59 కింద రుసుము పూర్తి స్థాయిలో చెల్లించిన దాదాపు 1450 దరఖాస్తులు పట్టాలను పంపిణీ చేయాలన్నారు. పెండింగ్ దరఖాస్తుల స్క్రూటినీ 3 రోజుల్లో పూర్తి చేయాలని, మార్చి 20 నాటికి పట్టాల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. యిల్ పామ్ సాగు లక్ష్యాలను మార్చి లో పూర్తి చేయాలన్నారు. తెలంగాణ కు హరితహారం క్రింద వచ్చే సీజన్ లో నాటే మొక్కలు స్థానికంగా నర్సరీ నుంచి సిద్దం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ... జిల్లా పరిధిలో జీఓ 76 కింద ఎంపిక చేసిన లబ్దిదారుల పెండింగ్లో ఉన్న రూ.2.56 లక్షల రుసుము వసూలు చేసి చలాన్ జనరెట్ చేస్తామన్నారు. పట్టాల పంపిణికి కూడా సన్నద్దం అవుతామని అన్నారు. అదనపు కలెక్టర్ దివాకర, డీఎఫ్ఓ లావణ్య, డీఎంహెచ్ఓ శ్రీరామ్, డీఏఓ విజరుభాస్కర్, జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవరావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.