Authorization
Sun April 13, 2025 07:21:11 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
అథ్లెటిక్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా కార్యవర్గం ఎన్నిక శుక్రవారం మానుకోట గౌతమి కళాశాలలో జిల్లా యువజన క్రీడల అధి కారి అనిల్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా అధ్య క్షుడిగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, ప్రధాన కార్యదర్శిగా అంతర్జాతీయ క్రీడాకారిణి భాష నాగమణి, ఉపాధ్యక్షులుగా జిన్నా రెడ్డి వెంకటేశ్వర్లు, కే కిషోర్‌కుమార్, శోభన్‌బాబు, ఎల్ రవి, సంయుక్త కార్యదర్శిగా దాక్షాయ నాయక్, వీరన్న, నాగమణి, మధుసూదన్, కార్యవర్గ సభ్యులుగా సుదర్శన్, భద్రయ్య, పార్వతి రెడ్డి, సురేష్ ఎన్నికయ్యారు. ఎన్నికల రాష్ట్ర పరిశీలకులుగా మహేందర్, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కైలాష్, న్యాయవాది సందకష్ణ వ్యవహరించారు.