Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై కొండా దంపతులు ధీమా
తూర్పు నియోజకవర్గంపైనే ఎక్కువ ఆసక్తి
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లపై ప్రత్యేక దృష్టి
అనుకుల వర్గాలతో విస్తృతంగా సమాలోచనలు..
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు..
గత వైభవ పునరుద్ధరణకు అహర్నిశలు కృషి
నవతెలంగాణ-వరంగల్
చాలా కాలం తర్వాత స్తబ్దంగా ఉన్న ఒకప్పటి తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకుని నిమిత్తమేమో గాని వరంగల్ తూర్పు నియోజకవర్గం పై గట్టి సాధిస్తామని తూర్పు నియో జకవర్గం నుండి బరిలోకి దిగుతామని గత కొంత కాలం నుండి పలు సందర్భాల్లో సూచిస్తూ వస్తున్న ప్పటికీ ఇది వాస్తవమేనంటూ ఇటీవల కొండా ముర ళీధర్‌రావు తూర్పు నియోజకవర్గంలో ఈ విషయమై తమ అను కులమైన వారితో పాటు వివిధ వర్గాల వారితో గతంలో తమకు అనుకూలంగా పనిచేసిన వారితో సమావేశమైనట్టు సమాచారం.
తూర్పులో విస్తృత ప్రచారంతో ముందుకు
ఎలాగైనా రాబోవు ఎలక్షన్లలో తూర్పు నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని భావి స్తున్న కొండా దంపతులు ఇప్పటి నుండే నియోజ కవర్గంలో విస్తృతస్థాయిలో పర్యటిస్తూ ప్రత్యర్థులు ఎవరున్నా, ఎదుర్కొనేం దుకు సన్నద్ధంగా ఉండేందు కే కొండా దంపతులు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలు స్తోంది. తూర్పు నియోజకవర్గంలో అనుకూల ప్రతి కూల నాయకులను సైతం కలిసి తమవైపుకు నడుచుకునే విధంగా కొండా మురళీధర్ రావు చొరవ తీసుకుంటున్నట్లుగుసగుస లాడుకుంటున్నారు.
కొండామురళీధర్ రావు స్వతహాగా మంచి మనిషి అయినప్పటికీ వచ్చిన తర్వాత ఎదురైన సవాళ్లతో కొన్ని కార్యకలాపాలు ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలతోపాటు తాను ఏది చెప్తే అది వేద మని లేకుంటే ఇబ్బందులు తప్పనిసరి అని పట్టు వీడ ని వెనకాడని వాడని అపోహాలు లేకపోలేదు. ముర ళి దంపతులు మొదటి నుండి అనుకూల రాజకీయ వాతావరణంలోని ప్రత్యర్థులను ఎదుర్కొనే వారని క్రమేణాపార్టీల మార్పు, అయా సందర్భాలలో తప్ప ని పరిస్థితులలో పార్టీలు మారడంకొంత రాజకీ యం లో వెనకడుగు వేయవలసి వచ్చిన ప్రత్యక్షంగా తాను నమ్మిన అనుచరులు కొంత మేర సహకరించలేదని అనుమానాలు ఊహగానాలు వినిపించాయి.
కొండా మురళీధర్‌రావు ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఆశించకపోయినా ఎమ్మెల్సీగా పలుమార్లు విజయం సాధించి రాజకీయంలో తన ఒరవడిని సష్టించారు. సురేఖకు అండగా బలహీన వర్గాలకు చేరువగా ఉం టారన్న మురళీధర్‌రావు కొందరిలో కఠిన స్వభావు డని ముద్ర లేకపోలేదు. అవినీతి పట్ల నిష్పక్షపాతం గా కఠినంగా ఉండటమే కొంతమందిలో కొండాపై కొంత అసూయ లేక పోలేదని వాదనలు ఉన్నాయి. ఏమైనాప్పటికీ 2018 వరంగల్ తూర్పు నియోజక వర్గ టికెట్‌ను ఆశించిభంగపడి పరకాల నియోజక వర్గంలో నుండి బరిలోకి దిగి కొండా సురేఖ ఓటమి పాలు కావడం తరువాతి కాలంలో పార్టీలో తరచుగా పాల్గొనకపోవడం తర్వాత జరిగిన పరిణామాలలో కాంగ్రెస్ అధిష్టానం వరంగల్ తూర్పున టికెట్ తమకే కేటాయిస్తుందన్న బలమైన వాదనలతో తిరిగి గతం లో కోల్పోయిన తూర్పు నియోజకవర్గం స్థానాన్ని ఈసారి తప్పనిసారి నిలబెట్టుకునే విధంగా కొండా దంపతులు ఇప్పటినుండి ఎలక్షన్ల కొరకు పక్క ప్రణా ళికలతో ముందుకు సాగుతున్నట్లు పలువురు చర్చించుకుం టున్నారు.
చర్చనీయాంశంగా సమీక్షలు ...
ఇప్పటికే నగరంలో కొండామురళీ బహిరం గం గా అంతర్గతంగా అంతకుముందు పనిచే సిన వారిని అనుకూలమైన వారిని తమకు సహకరిం చే వారిని కలుస్తూ తమవైపుకు మార్చుకొనే టట్లు తెలిసింది. ఏమైనా కొండామురళి తమ అనుచరులతో సమావే శం తమదైన శైలిలో నియోజక వర్గంను చుట్టేస్తూ ఉండడం ప్రజల్లో చర్చ అంశంగా మారింది. ఒకవేళ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కొండా దం పతులకు టికెట్ లభిస్తే ప్రత్యర్థులు కూడా బలమైన నాయకున్ని ఎన్నుకునే విషయమై పునరాలోచించు కోవాల్సిన పరిస్థితులు ఉత్తన్నమయ్యే అవకాశాలు లేక పోలేదని పలువురు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పా ర్టీ వరంగల్ తూర్పులో పాగా వేయాలంటే నేతలు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాల్సిందే