Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేట పురపాలక సంఘం 20 23-2024 వార్షిక అంచనా బడ్జెట్ రూ. 50.07కోట్లు కేటాయించారు.శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ పీ.గోపి, అద నపు కలెక్టర్ అశ్వినితానాజివాకడే హాజర య్యారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ ర జినీకిషన్ బడ్జెట్నువెల్లడించారు.పెద్ద మొత్తం రూ.14,12,96,000లు కేటాయిం చామని ఇందులో పన్నుల రూపేణ 5.07 కోట్లు, అద్దె ఆదా యం ద్వారా రూ.1.16కోట్లు సానిటేషన్ రూ.35. 60 లక్షలు, పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా రూ.1. 09 కోట్లు, నాన్‌ప్లాన్ గ్రాంట్ రూ.3.20కోట్లు, ప్లాన్ గ్రాంట్ రూ.6కోట్లు అంచనా బడ్జెట్లో రూపొందిం చామని ప్రారంభ నిల్వ రూ.1ఒక కోటి 9లక్షల 80 వేలు కాగా మొత్తంగా రూ.14 కోట్ల 12లక్షల 96 వేలుపెద్దమొత్తం పద్దుగా ఇతర గ్రాంట్లు రూ.35. 015 కోట్లు బడ్జెట్లో పేర్కొన్నట్లు తెలిపారు. వ్యయ ములకింద వేతనాలు రూ.4.50కోట్లు,సానిటేషన్ వి భాగానికి రూ.94.05లక్షలు, విద్యుత్‌చార్జీల చెల్లింపు రూ.1.01కోట్లు, రుణం చెల్లింపు రూ.2లక్షలు, గ్రీన్ బడ్జెట్ కింద రూ.92.31లక్షలు, 1/3 మిగులు బడ్జెట్ ఇంజనీరింగ్ విభాగం రూ.89లక్షలు, పరిపాలన వి భాగం ఖర్చు రూ.62.90లక్షలు, పట్టణ ప్రణాళిక వి భాగం రూ.2లక్షలు, వార్డుల వారిగా ఖర్చు రూ.59 లక్షలు, నాన్‌ప్లాన్‌గ్రాంట్ రూ.3.20 కోట్లు, ప్లాన్ గ్రాంట్ రూ.6కోట్లు అంచనా వ్యయముగా రూపొం దించామన్నారు. ప్రభుత్వం నుంచి ఇతర గ్రాంట్లు రూ.35.015 కోట్లు అంచనా బడ్జెట్ల కేటాయించా మని వివరించారు.ఈ బడ్జెట్‌ను కౌన్సిల్‌ను ఆమోదిం చినట్లు ప్రకటించారు.
మౌళిక సౌకర్యాలు మెరుగుపర్చడానికి బడ్జెట్ కేటాయింపు : జిల్లా కలెక్టర్ బీ.గోపీ
పట్టణ ప్రజలకు మౌళిక సౌకర్యాలు కల్పించడా నికి మున్సిపల్ బడ్జెట్ కేటాయింపులు ఉపయోగప డాలని కలెక్టర్ బీ.గోపీ అన్నారు. బడ్జెట్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై కలె క్టర్ మాట్లాడుతూ మున్సి పల్ సాధారణ నిధులకల్పన మరింతగా పెరుగాల్సిన అ వసరం ఉందన్నారు. ప్ర భుత్వం కేటా యించిన నిధులను సరైన ప్రణాళికతతో అభివృద్ధి పనులు చేపట్టా లని సూచించా రు.ఈ సందర్భంగా పలువురు కౌన్సిల ర్లు పలుసమస్యలను, అంశాలను ప్రస్తా వించారు. పాకాల్రోడ్డులోని సర్వే నెంబ ర్ 55లోని సశ్మానవాటిక స్థలాన్ని సర్వే చేసి హద్దుల ను ఏర్పాటు చేయాలని 4వ వార్డు వార్డు కౌన్సిలర్ శీలం రాంబాబు, వరమ్మ తోటలోని గ్రీన్ ల్యాండ్‌కు ప్రహరిగోడ నిర్మాణంచేయాలని,సంజరుగాంధీ నగ ర్లోని పాఠశాలకు ప్రహరి గోడ ఏర్పాటు చేయాలని వార్డుసభ్యులు కోరారు. ఆసరా పింఛన్ లబ్దిదారు లకుకార్డు ఉండి కూడ పింఛన్లు రావడంలేదని, అ క్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. మం చినీటి ఎద్దడిలేకుండా మిషన్ భగీరథ పనులను వేగ వంతంగా పూర్తి చేయాలని, డంపింగ్ యార్డు వ్యర్థా లను రీసైక్లింగ్ చేయాలనికోరారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగు చర్య లు తీసుకుంటా మని చెప్పారు.ఈ సమావేశంలో వైఎస్ చైర్మన్ ముని గాల వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.