Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈజీఎస్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేయాలి
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు రాష్ట్రం అండ
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేయడం దుర్మార్గమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాన్పరెన్స్ హాల్లో నిర్వహించిన ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉపాధిహామీ పథకానికి కేవలం రూ.29 వేలకోట్ల నిధులను మాత్రమే కేటాయించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. కూ లీలకు ఉపాధిహామీ పనులు క్రమేణ లేకుండా చేయడానికే బడ్జెట్లో కోత విధిం చిందని విమర్శించారు. జాబ్‌కార్డులు కలిగిఉన్న కూలీలకు అనేక సాంకేతిక సమ స్యలు సృష్టించడం వల్ల ఇప్పటికే మస్టర్లో నమోదు కాకుండాపోయి నష్టపోతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అను సంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మాణం చేసి కేంద్రానికి పంపించి నా పట్టంచుకోవడం లేదన్నారు. వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల కూలీలకు పనిదినాలు దొరకడంతో పాటు రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుం దన్నారు. ఈ డిమాండ్‌ను బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా తెరమీదకు తీసుకొచ్చి ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించేందుకు పోరాడనుందని తెలిపారు.ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఇప్పటికే ఫీల్డ్అసిస్టెంట్లు, ఈసీ, టీఏ, సీవో, సీఏ, ఏపీవోల సమస్యలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళిక ఉపాధ్యక్షులు బోయినపెల్లి వినోద్ దృష్టి కి తీసుకెళ్లామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రాష్ట్ర అధ్యక్షులు మోహన్ రావు, టీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగయ్య, కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, సే వల సంఘం రాష్ట్ర కార్యదర్శి విజరు, ఎఫ్ఎల్ఏ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకల రవి, బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు, జేఏసీ వరంగల్ జిల్లా చైర్మన్ జాకబ్ తదితరులు పాల్గొన్నారు.