Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
ప్రస్తుత సమాజంలో రసా యన శాస్త్రం కెమిస్ట్రీ పాత్ర కీల కమైందని సీఎస్ఐఆర్ ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జాతీయ సాంకేతిక వి ద్యాలయం నిట్ వరంగల్ అం బేద్కర్ లర్నింగ్ సెంటర్లో రసా యన శాస్త్ర విభాగం ఇనార్గాని క్, ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీలో ఇటీవలి పురోగతిపై రెండు రోజుల జాతీయ సదస్సును ఫిబ్రవరి 28న సర్వీస్ నుండి పదవీ విరమణ పొందుతున్న ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి సేవలను గౌరవించేందుకు సదస్సునుశుక్ర వారం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎస్ఐఆర్ ఐఐసిటి డై రెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ రంగారావు, ప్రొఫెసర్ రామానుజాచారి, ప్రొఫెసర్ ఎస్ జొన్న లగడ్డ, ప్రొఫెసర్ జగన్నాధస్వామి తదితరులు పాల్గొన్నారు.