Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, వై ద్యానికి పెద్దపీట వేస్తున్నారనిప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ మర్కాజీ, ప్రాక్టీసింగ్ పాఠశాలలో అభ్యాసన దీపికలు, ఎగ్జామ్కిట్స్ను వినయ్‌భాస్కర్ పంపిణీ చేసి విద్యార్థులకు అభ్యాసన దీపికలు ఎ గ్జామ్ కిట్స్ పంపిణీ చేసి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 'మన బస్తీ మనబడి' కార్యక్ర మాన్ని చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. విద్యార్థుల వి జ్ఞానానికై అభ్యసన దీపికాలు అందిస్తున్నామని విద్యార్థుందరికీ పరీక్షలు రాయడా నికి అవసరమయ్యే పరికరాలను అందించిన సంతోష్‌కు అభినందనలు తెలిపా రు. మనబస్తీ-మనబడి కార్యక్రమములో భాగంగా 12రకాల మౌలిక సదుపా యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అదేసమయంలో కార్పొరేట్ పా ఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఈ రోజు పిల్లలతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ హై, కార్పొరేటర్లు చెన్నం మధు, సోద కిరణ్, ఎలకంటి రాములు తదితరులు పాల్గొన్నారు.