Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్
నవతెలంగాణ-వర్ధన్నపేట
రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలకు సమ ప్రాధా న్యత కల్పిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రా ష్ట్ర ప్రభుత్వమని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేటఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నా రు.శుక్రవారం మండలంలోని ఇల్లందలో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించ నున్న వివిధ కుల సంఘా ల కమ్యూనిటీ భవన ని ర్మాణాలకు బండ ప్రకాష్ తో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్ శంకుస్థాపన చేశా రు. ఈ సందర్బంగా స్థాని క సర్పంచ్ సుంకరి సాంబ య్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక్క ఇల్లం ద గ్రామంలోనే ముదిరాజ్ కమ్యూనిటీ హల్కు రూ. 55లక్షలు, యాదవ కమ్యూనిటీ హల్ రూ.35లక్షలు, ఎస్సి కమ్యూనిటీ హల్కు రూ.35లక్షలు, గౌడ క మ్యూనిటీహల్కు రూ.35లక్షలు, మున్నూరుకాపు క మ్యూనిటీ హల్ రూ.10లక్షలు, ఆర్యవైశ్య కమ్యూనిటీ హల్ రూ.5లక్షలు, రజక కమ్యూనిటీ హల్కు రూ. 5 లక్షలు మొత్తం రూ.1.80కోట్లతో కుల సంఘాల భవ నాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రలో కులవృత్తులకు పూర్వ వైభవాన్ని తీ సుకువచ్చారని వెల్లడించారు. రాష్ట్రంలో గోర్లు, ఉచిత చేపపిల్లల పంపిణీతో ఆయాకుల సంఘాలలో గణ నీయమైన అభివృద్ధి సాధించడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయాని తెలిపారు. వీటితో పాటు గౌడ కార్మికులకు పన్నుమాఫీ, రజకులకు వి ద్యుత్సబ్సిడీవంటి అనేక కార్యక్రమాలతో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోం దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అప్పారా వు, జెడ్పీటీసి మార్గం బిక్షపతి, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, ఎంపిటిసిలు శ్రీనివాస్,జ్యోతి, ఆత్మ చైర్మన్ గోపాల్ రావు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి అశోక్, ఉప సర్పంచ్ రాజ్ కుమార్, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.