Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
కాజీపేట మండలం మడికొండ దక్షిణ కాశీ హరిహర క్షేత్రం గా విరాజిల్లుతున్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి సీతారా మచంద్రస్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్క రించుకొని తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మౌత్సవాలలో భాగంగా శుక్రవారం ముగింపు కార్యక్రమం శివపార్వతుల రధ ఊరేగింపును నిర్వహించారు. ఆలయ అర్చకులు రాగిచేడు అభి లాష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ రథంపై శివపా ర్వతులను మడికొండ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హాజరై రధ ఊరేగింపును ప్రారంభించారు. డప్పు చెప్పులు కోలాటం మడికొండ పురవీధుల్లో రథయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శేషు భారతి, దేవాలయ చైర్మన్ దువ్వ నవీన్, దేవాలయ ధర్మకర్తలు నార్ల గిరి కుమారస్వామి, బుర్ర సంధ్యారాణి, ఓర్సు బాబు, భూపాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బొల్లికొండ వినోద్, అర్చకులు విష్ణువర్ధనా చారి, ఆలయ సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.