Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
నవతెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణ బడా చోర్ కేసీఆర్ అని, కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని, సింగరేణి ప్రైవేటు పరం చేయాలని చూస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తప్పులు కప్పిపుచ్చుకోవడానికే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని, ఇక తుపాకి రాముడికి రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ఇన్చార్జి చంద్రుపట్ల సునీల్ రెడ్డి మొదటి విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా మంథని నియోజక వర్గం బూత్ కమిటీ సమ్మేళనం నిర్వహించారు. జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ గడ్డం వివేక వెంకట్ స్వామి, మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి, భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి కీర్తి రెడ్డితో కలిసి బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కెసిఆర్, కేటీఆర్ పాలనలో ఒరగబెట్టిందేమీ లేదన్నారు. తండ్రి పెట్టిన భిక్షతో రాజకీయాలకు వచ్చిన కేటీఆర్ విమర్శలు చేసే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని మంథని నియోజకవర్గం లోని తాడిచర్ల మండలంలో సింగరేణి గలను ప్రైవేటుపరం చేసి 200 కోట్ల రూపాయల స్కాంకు తెగబడ్డారని అన్నారు. చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టకుండా తాత్పర్యం చేస్తున్నారని అన్నారు. మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇందుకు బాధ్యులైన వారెవరిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... మంథని నియోజక వర్గంలో అరాచకం పరిపాలన కొనసాగుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మంథని నియోజక వర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతం అభివద్ధి జరగాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని అన్నారు. ప్రాజెక్టుల్లో భూములు, జాగలు కోల్పోయిన రైతులకు ఏం లాభం చేశారని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరి హారం కూడా చెల్లించలేదని అన్నారు. రోజు రోజుకి ప్రజా చైతన్య యాత్రకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తమ జెండా గద్దెలను కూల్చివేశారని అన్నారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని అన్నారు.మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి, భూపాలపల్లి బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా నాయకులు పాపయ్య, ఉదయ ప్రతాప్, రావుల రామ్నాథ్, అనిల్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, దుర్గం తిరుపతి, బండం వసంత రెడ్డి, ఎంపిటిసి విజయ రెడ్డి, లావణ్య, భాస్కర్ రెడ్డి, పూసల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.