Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాతృత్వం చాటుకున్న ఎన్నారై దుర్గా ప్రసాద్
నవతెలంగాణ-భూపాలపల్లి
కౌటం శంకర్ (34)కు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న తెలంగాణ వాసి నేరుగంటి దుర్గా ప్రసాద్ శంకర్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.40వేల ఆర్థిక సహాయాన్ని అందించి దాతత్వాన్ని చాటుకున్నారు. భూపాలపల్లి జిల్లా కుందూరపల్లి గ్రామ నివాసి కౌటం శంకర్ పది సంవత్సరాలుగా రెండు కిడ్నీలు పాడై డయాలసిస్‌తో బతుకీడుస్తున్నాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా అతని కిడ్నీలు పాడవడంతో మంచానికే పరితమయ్యాడు. కడు పేదరికంతో భార్యా పిల్లలను పోషించుకోలేక, వారానికి మూడు రోజులు డయాలసిస్ చేపించుకోలేక, కనీసం మందులు కొనుక్కునే పరిస్థితి లేదు. దీంతో శంకర్ భార్య లావణ్య(రజిత) కుటుంబ పోషణను భుజాన వేసుకొంది. వరంగల్ లోని ఒక పెట్రోల్ పంపు లో పని చేస్తూ భర్తకు ట్రీట్మెంట్ చేపిస్తోంది. వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న జిల్లా ఇన్చార్జి బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామి సదరు సంఘటనను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. స్పందించిన ఎన్ఆర్ఐ దుర్గా ప్రసాద్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇలాంటి వ్యక్తులకు సాయమందించేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామి, సీనియర్ అసిస్టెంట్ భాను కిరణ్, బాలల సంరక్షణ అధికారి రాజకొమురయ్య, ఎల్‌సీపీఓ మొహినొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.