Authorization
Sat April 12, 2025 05:35:29 am
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని రెండవ యాదగిరి గుట్టగా పేరొందిన శ్రీహేమాచల లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ పునరుద్దరణ కమిటీ చైరమన్గా రెండవ సారి మల్లూ రుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు నూతులకంటి ముకుంధం నియమించ బడ్డారు. శనివారం హన్మకొండ జిల్లా కేంద్రంలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్లో ములు గు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ముకుందానికి నియామక పత్రాన్ని అందజేశారు. గత ఏడాది మే నెలలో జరిగిన లక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మౌత్సవాలకు ముందుగా మొదట పునరుద్దరణ కమిటీ చైర్మన్గా ముకుందాన్ని నియమించిన దేవాదాయ ధర్మదాయశాఖ ఈ సంవత్సరం మూడు నెలల ముందుగానే ముకుందాన్ని తిరిగి రెండవ సారి నియమించినట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కుడు ముల లక్ష్మీనారాయణ,కొత్తగూడా మండలపార్టీ అధ్యక్షులు వేణు, మండల నాయ కులు చిట్టిమల్ల సమ్మయ్య, సోయం ఈశ్వర్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరిలు పాల్గొన్నారు.