Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం జనగామ పట్టణంలోని 10వ వార్డు లో ఆ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా వార్డులో గడపగడపకు తిరుగుతూ చేతిలో చేయి వేస్తూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేప ట్టిన పథకాలను వివరించారు. ఇందిరమ్మ ఇళ్ళు, రైతు రుణ మాఫీ, విత్తన సబ్సిడీ, పేదలకు భూ పంపిణీ, మహిళలకు పావలా వడ్డీ, ఆరోగ్య శ్రీ, ఉద్యోగులకు హెల్త్ కార్డులు తదితర కాంగ్రెస్ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అద్యక్షులు జమాల్ షరీఫ్, నాయకులు తోట సత్యం, జాఫర్ షరీఫ్, నోముల రాజు, పట్టూరి శ్రీనివాస్, మాజిద్, మీడియా ఇంచార్జి పిట్టల సతీస్, బం డారు శ్రీనివాస్, వేముల మల్లేశం, మేకల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.