Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ అండతోనే అదానీ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడు
జంట కేసముద్రంను అన్నివిధాలా అభివృద్ధి చేయాలి
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బి. అజయ్ సారథి రెడ్డి
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమైయ్యారని, బీజేపీ అండతోనే అదానీ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడని, ప్రజా సమస్యలపై పోరాడే ది కమ్యూనిస్టులేనని, జంట కేసముద్రంను అభివృద్ధి చేయాలని సీపీఐ జిల్లా సహా య కార్యదర్శి బి. అజయ్ సారథి రెడ్డి అన్నారు. కేసముద్రం మండల కేంద్రంలోని ధర్మన్న భవన్లో సీపీఐ మండల కౌన్సిల్ సమావేశం ఎస్కే ఇమామ్ అలీ అధ్యక్ష తన జరుగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బి. అజరు సారథి రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ పాలక పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చే యడంలో విఫలమయ్యాయని, హామీల అమలు కోసం సీపీఐ నిరంతరం పోరాడు తుందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడి ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైంద ని, దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టి దివాలా తీయించిందన్నారు. మోడి నమ్మిన బంటు ఆదానికి ప్రభుత్వ రంగసంస్థలను దోచి పెట్టారని, బీజేపీ అండతోనే అదా నీ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడని, ఆదాని కుంభకోణంపై విచారణ జరిపించా లని డిమాండ్ చేశారు. విపక్ష పార్టీల నాయకులపై సిబిఐ, ఈడిలను ప్రయోగిస్తు న్న మోడి ప్రభుత్వం ఆదానిపై ఎందుకు ప్రయోగించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణపై మోడీ ప్రభుత్వానిది సవతీ తల్లి ప్రేమ అని, విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని అన్యా యం చేశారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి పట్టిం పులేదని విమర్శించారు. జిల్లాలో అధికంగా ఉన్న పోడు రైతులకు పట్టాలు ఇవ్వ డంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, డబల్ బెడ్రూంలు ఎంతమందికి వచ్చాయో ఆ పార్టీ నాయకులకే పూర్తిగా తెల్వదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకై చిత్త శుద్ధితో పోరాటం చేస్తుంది సీపీఐ పార్టీ ఒక్కటేనని అన్నారు. బయ్యారం ఉక్కు పరి శ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు అడుతున్నాయని ఆరోపించారు. వట్టి వాగుకు నీళ్ళు రావడమంటే ప్రతిపక్షాల పోరాట ఫలితమని అన్నారు. కేసముద్రం మండలాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలని, అంతర్గత రోడ్ల నిర్మాణం, ప్రభు త్వ డిగ్రీ కళాశాలను, 100 పడకల ప్రభుత్వ హస్పిటల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధి, విభజన హామీల అమలుకై సీపీఐ మార్చి 25వ తేదీ నుండి పాదయాత్ర చేపడుతుందని తెలిపారు. మన జిల్లా బయ్యారం నుండి ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర ఉ మ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని, ఈ పాదయాత్రకు ప్రజలు సహకరించి విజయవంతం చేయడంతో పాటు పాలకుల కుట్రలను ఎండకట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీిఐ కేసముద్రం మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్ఎ స్టాలిన్, సీపీఐ మండల నాయకులు చొప్పరి వెంకటయ్య, వి.లక్ష్మీనర్సయ్య, దాళ్వాయి శ్రీనివాస్, దాసరి లింగస్వామి, పిన్నోజ్ బాలాచారి, దళ్వాయి కిషన్, గుండెల కొమురయ్య, ఎన్. కోట య్య, మాళోతు మంజ్యనాయక్, భూక్య చక్రు, ఎం.ఉప్పలయ్య, కే.గణేష్, ఎం. అనిల్ కుమార్, సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.