Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్ఘనపూర్
ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన ఆయుధం చదువు ఒక్కటేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో సర్కారు బడులకు మహర్ధశ లభించిందని ఎమ్మెల్యే రాజ య్య అన్నారు. శనివారం చిల్పూర్ మండలం రాజవరం, చిన్న పెండ్యాల, ఘన్ పూర్ మండలకేంద్రంలో, చాగల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఈజీఎస్ నిధులతో కలిపి మొత్తం గా రూ. కోటి 31లక్షల పైగా అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, సర్పంచులు మామి డాల లింగారెడ్డి, మారెపల్లి తిరుమల, క్రిష్ణా మోహన్ రెడ్డి, పోగుల సారంగపాణి, సురేష్ కుమార్ అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అబివృద్ధికి సీడీఎఫ్ ఐదు కోట్లలో రెండున్నర కోట్లు, మరో రెండున్నర కోట్లు నియోజకవర్గంలోని పాఠశాల ల అభివృద్ధికై ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మారపాక రవి, డీఈఓ రాము, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, బొమ్మిశెట్టి సరితా బాలరాజు, ఎంపిటిసిలు మారేపల్లి లలితాదేవి, శ్యాం రెడ్డి, కన కం స్వరూపాగణేష్, చిల్పూర్ దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కో ఆర్డినేటర్ పోలేపల్లి రంజిత్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ చిగురు సరిత, మహిళా నాయకులు పావని, జ్యోతి రెడ్డి, మౌనిక, పాఠశాల ఉపాధ్యాయ బృందం, పాల్గొన్నారు.