Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్సాపూర్(పిఏ)గ్రామాన్ని దత్తత తీసుకున్న డిఈ నాగేశ్వరరావు
నవతెలంగాణ-తాడ్వాయి
విద్యుత్‌ను విచ్చలవిడిగా కాకుండా సక్రమమైన మార్గంలో రైతులకు ఉప యోగపడే విధంగా విద్యుత్తును వాడుకోవాలని ములుగు ఎన్పీడీసీఎల్ డిఈ ఈ పులుసం నాగేశ్వరరావు అన్నారు. శనివారం మండలంలోని నర్సాపూర్(పిఏ) గ్రా మంలో విద్యుత్ వినియోగంపై స్థానిక సర్పంచ్ మంకిడి నరసింహ స్వామి ఆధ్వ ర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ట్రాన్స్ఫార్మర్ల ను, విద్యుత్ లైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ ములుగు డిఈ పులుసం నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్తును వృథా చేయకుండా సద్వి నియోగం చేసుకోవాలన్నారు. విద్యుత్ వినియోగదారులు ప్రతి నెల, రెగ్యులర్‌గా ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. రైతులు ఆటో మెటిక్ స్టార్టర్లను తొలగించి, వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు బిగించుకో వాలన్నారు. డిఈ వెంట ఏఈ టెక్నికల్ కృష్ణారావు, సబ్ ఇంజనీర్ జ్ఞానేశ్వర్, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.