Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
గిరిజన ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ జయం తి ఉత్సవాలకు గిరిజనులు భారీగా ఎత్తున తరలిరా వాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐల య్య అన్నారు. శనివారం మండల పరిధిలోని రామ చంద్రు తండా, బీసీ తండాల్లో పార్టీ ముఖ్య నాయకు ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నేడు నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో సంతు సేవాలాల్ జయంతి ఉత్స వాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు భారీ ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమం లో పసులేటి వెంకట్రామయ్య, సర్పంచ్‌లు జాటోత్ చిలుకమ్మ హేమని, ధరావత్ పద్మదేవేందర్, మండల ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు ఎదునూరి శ్రీనివాస్, మండల పార్టీ అధికార ప్రతినిధి బానోత్ సోమన్న, జాటోత్ దస్రు నాయక్, అంగోత్ రవి, జాటోత్ వెం కన్న, ఉపసర్పంచ్లు జాటోత్ అమలచక్రు, ధరవత్ హరిసింగ్ పాల్గొన్నారు.
గూడూరులో సంతు సేవాలాల్ ఉత్సవాలు
గూడూరు : మండల కేంద్రంలో సంత్ సేవాలా ల్ మహారాజ్ 284 వ జయంతి ఉత్సవాలు సేవాలా ల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించ డం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులగా స్థానిక తహసీల్దార్ అశోక్ కుమార్, సర్పంచ్ నునా వత్ రమేష్ నాయక్, పాల్గొని సేవాలాల్ మహారాజ్ బంజార జాతి సమాజం కోసం చేసిన సేవలు అమో ఘం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అ ధ్యక్షులు ధర్మ నాయక్, ప్రధాన కార్యదర్శులు భూక్య సురేష్ నాయక్, బాలు నాయక్, భరత్ నాయక్, కటా ర్ సింగ్, వాల్యనంద కన్నె గురుస్వామి, ఉపాధ్యాయు లు శ్రీనివాస్, గోపినాథ్, కొమ్మాలు,పంచాయతీ కార్య దర్శి భీమానాయక్ తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ గుడి ప్రారంభాన్ని జయప్రదం చేయాలి
తొర్రూర్ రూరల్ : పాలకుర్తిలో సేవాలాల్ మే రమ్మ యాడి గుడి నిర్మాణానికి సహకారం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుచే ఆదివారం ప్రా రంభం కానున్న సేవాలాల్ గుడి కార్యక్రమాన్ని జయ ప్రదం చేయాలని స్థానిక సోమరం కుంట తండా సర్పంచ్ బానోత్ యాకమ్మ కిషన్ నాయక్ తండాలో ఇంటింటికి తిరిగి నెయ్యి నూనె సేకరించి గ్రామ ప్రజ లందరినీ ఇంటింటికి తిరిగి ఆహ్వానించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుర్తి గుడి ప్రా రంభానికి తండాలో గిరిజన వేషధారణతో గిరిజన గుడి ప్రారంభానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మడిపల్లి ఉప సర్పంచ్ నలుగురి రామలింగం తనవంతు సహాయా న్ని సర్పంచ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరు నాగరి విద్యాసాగర్ రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హాజరుకానున్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి
పాలకుర్తి : సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వారోత్స వాల్లో భాగంగా నేడు పాలకుర్తిలో జరిగే నియోజక వర్గస్థాయి సేవాలాల్ జయంతి ఉత్సవాలతో పాటు ఆలయ నిర్మాణానికి చేపట్టి శంకు స్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ నిర్మాణ కమిటీ డాక్టర్ భూక్య రవి రాథోడ్ తెలిపారు. శనివారం ఆలయ నిర్మాణ ప్రదేశంలో ఆల య నిర్మాణ కమిటీ గౌరవ సలహాదారులు, స్టేషన్ ఘన్పూర్ తహసిల్దార్ లావుడియా ఫుల్ సింగ్ నాయ క్, ఆలయ నిర్మాణ కమిటీ ఉద్యోగుల సంఘం నాయ కులు ధరావత్ కిషన్ నాయక్‌తో కలిసి మాట్లాడుతూ దేశంలో 13 కోట్ల మంది గిరిజనులు ఉన్నారని తెలి పారు. పాలకుర్తి నియోజకవర్గంలో అధికంగా గిరిజ నులు ఉండటంతో నియోజకవర్గస్థాయిలో సేవాలాల్ ఆలయ నిర్మాణానికి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థలాన్ని కేటాయించడంతోపాటు ఆలయ నిర్మా ణం కోసం రెండు కోట్లు మంజూరు చేశారని తెలి పారు. నేడు ఆదివారం పాలకుర్తిలో జరిగే సేవలాల్ ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంతో పాటు జయంతి కార్య క్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారని తెలిపారు. సేవాలాల్ జయంతి విజయవంతం చేసేందుకు నియోజకవర్గం లోని గిరిజన ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచులు, ఎంప ీటీసీలు,తండా పెద్దలుపాల్గొని విజయవంతం చేయా లని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మా ణ కమిటీ సభ్యులు లావుడియా మల్లు నాయక్, జరు పుల బాలు నాయక్, లావుడియా దేవేందర్ నాయక్, ధారావత్ యాకూబ్ నాయక్, ధరావత్ జై సింగ్ నా యక్, ధరావత్ రామ్ సింగ్ నాయక్, నవీన్ నాయక్, రవి నాయక్, సేవాలాల్ సురేష్ మహారాజ్, లకావత్ నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.