Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ఘనపూర్
దేశంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలు గు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటియూ మండల నాయకులు గుర్రం లాజర్ డిమాండ్ చేశారు. కమిటీ పిలుపుమేరకు ఈ నెల 28న జరగబోయే గ్రామ పంచాయితీ సిబ్బంది పాదయాత్ర ముగింపు సభకు వెళ్లనున్న క్రమంలో ఎంపీడీఓ కార్యాలయంలో సమాచార పత్రాన్ని శని వారం అందజేశారు. అనంతరం సంఘం నాయకు లు, పారిశుధ్య కార్మికులతో కలిసి సమావేశం జరిగిం ది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోడీ ప్రజా సమస్యలను గాలికివదిలేసి గార డి అటగాడిలా అవతారమెత్తిందన్నారు.ప్రజలకు చేసి న ఏటా రెండు కోట్ల ఉద్యోగాల వాగ్ధానం మాట అటుంచితే, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేయడం మొదలు పెట్టారని ఎద్దేవాచేశారు. ప్రజలను ఓటు బ్యాంక్‌గానే చూస్తూ, దోపిడీకి గురి చేస్తూ, మతాన్ని ముందుకు తెచ్చి జనాలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ప్రయివేటీకరణను బలోపేతం చేయ డం, కార్మికులను యాజమాన్యాల చెప్పుచేతుల్లో ఉం చడానికి నాలుగు లేబర్ కోడ్లని తీసుకొచ్చి కార్మికు లకు ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామ పంచాయితీ సిబ్బందికి కార్మిక చట్టాలు వర్తింప జేయ కుండా కుట్ర పన్నుతున్నారని, తద్వారా ఈఎస్ఐ, పీఎఫ్, ఇతర కార్మిక చట్టాలకు నోచుకోని దుస్థితికి నెట్టివేయబడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు. 4లేబర్ కోడ్ల రద్దు, కనీస వేతనం 26వేలు, పర్మినెంట్ వేత నాలు పెంపు, మల్టీ పర్పస్ విధానం రద్దు, ప్రత్యేక స్టేటస్ కోసం సీఐటీయూ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా సాగిందని, ముగింపు సభకు కార్మి కులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయా లని కోరారు. ఈ కార్యక్రమంలో బోసు రాజు, శ్యాం ప్రకాష్, కె.రాజు, శ్రీనివాస్, పాల్గొన్నారు.