Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం నుండి ప్రత్యేక మండలంగా ఏర్పడిన ఇనుగుర్తి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. శనివారం ఐడిఓసి భవనంలోని కలెక్టర్ ఛాంబర్ లో పార్లమెంటు సభ్యులు(రాజ్యసభ) వద్దిరాజు రవిచంద్ర జిల్లా కలెక్టర్ శశాంకతో సమావేశమయ్యారు.ముందుగా కలెక్టర్ శశాంక మర్యాదపూర్వకంగా పూల మొక్కను పార్ల మెంటు సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు అందిస్తూ స్వాగతం పలికారు.అనంతరం నూతనంగా ఏర్పడిన ఇనుగుర్తి మం డల అభివద్ధిపై కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులతో సమా వేశమై పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర సమగ్రంగా సమీ క్షించారు. ముందుగా పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర ఇనుగుర్తి మండల పరిస్థితులను విపులంగా వివరి స్తూ 35 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇనుగుర్తి మండల సమ స్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 14 గ్రామపంచాయ తీలతో ఐదు రెవెన్యూ గ్రామాల గల ఇనుగుర్తి మండలాన్ని సమూలంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు. మండల అభివృద్ధి కార్యాలయానికి పోలీస్‌స్టేషన్‌కు స్థలాన్ని కేటాయిస్తామని భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపిం చాల్సిందిగా కలెక్టర్‌ను కోరారు.ఇనుగుర్తి మండలాన్ని మో డల్‌గా తీర్చిదిద్దేందుకు పాఠశాల అభివృద్ధి పనులపై దృష్టి పెట్టానని, అదేవిధంగా ఆ గ్రామంలో పురాతనమైన శివాల యాన్ని సొంత నిధులతో పునర్నిర్మిస్తానన్నారు. ఇనుగుర్తి మండలం పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా ఉందని విద్యా వైద్య సౌకర్యాలు కొరత ఉన్నాయని, 2391 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, అందుకనే పాఠశాలను మోడల్ స్కూల్‌గా నిర్మాణం చేపట్టనున్నామని, కళాశాలకు అప్‌గ్రేడ్ ప్రతిపాదనలతో పాటు మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించ తలపెట్టామని, అధికారులు సహ కరించి ఈ రెండింటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వా నికి పంపించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఇనుగుర్తి పాఠశాలలో 8, 9 తరగతులు చదివే విద్యార్థి నులకు సైకిల్స్ అందచేయగలిగితే సకాలంలో పాఠశాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు.అలాగే పదవ తరగతి పరీ క్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అల్పాహారంకై సహకా రం అందజేయాలన్నారు. ఇనుగుర్తి పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు లే అవుట్‌ను త్వరలోనే అంది స్తామన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశా లల అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మైనార్టీ సంక్షేమం ద్వారా శాఖ నిధులతో గురుకులం ఏర్పాటుకు చర్యలు తీసు కుంటామన్నారు.ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంకు ప్రహరీ నిర్మాణంకు చర్యలు తీసుకుంటామని సబ్ సెంటర్‌ను ఇను గుర్తి హాబిడేషన్లో ఏర్పాటు చేస్తామన్నారు. 108 వాహనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పీహెచ్సీలలో మహిళా డాక్టర్లు నియామకానికి చర్యలు తీసుకుంటామన్నా రు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మిడిల్ పోల్స్ ఏర్పాటుకు చర్య లు తీసుకుంటామని ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తామన్నా రు.అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామ న్నారు. రహదారులు డ్రైన్స్ నిర్మాణాలు త్వరలో చేపడతామ న్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో డ్రైనేజీ పైప్‌లైన్‌కు సత్వ రమే చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ సమావేశంలో ఆదనపు కలెక్టర్ డేవిడ్ డిఆర్డిఏ పిడి సన్యాసయ్య, డిపిఓ దన్ సింగ్, మహిళా సంక్షేమ అధికారిని నర్మదా, పంచాయతీ రాజ్, అధికారి సురేష్, వైద్యాధికారి హరీష్ రాజు, సిపిఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఇనుగుర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఎంపీ రవిచంద్ర
తాను పుట్టిన ఊరు ఇనుగుర్తిని మండల కేంద్రంగా ఏ ర్పాటు చేసేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరి సహకారంతో విశేష కృషి చేశానని, దీనిని ఆదర్శంగా తీర్చిది ద్దుతున్నానని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పా రు.ఇందులో భాగంగా మహబూబాబాద్‌లో కలెక్టర్ శశాంక తో ఎంపీ రవిచంద్ర శనివారం రెండు గంటల పాటు సుదీ ర్ఘంగా చర్చించారు.ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించిన కలెక్టర్ శశాంక ఎంపీ రవిచంద్రతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్య టించి తనకు నివేదిక సమర్పించాల్సిందిగా అదనపు కలెక్టర్ డేవిడ్‌ను ఆదేశించారు.దీంతో వెంటనే డేవిడ్ ఎంపీతో కలిసి ఇనుగుర్తి చేరుకుని ఎస్సీ బాలికల జూనియర్ కళాశాల, జెడ్పీ హైస్కూల్, ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిని పరిశీలించారు. బాలికల జూనియర్ కళాశాలలో మరుగుదొడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగు పర్చేందుకు, పరిశుద్ధమైన తాగునీరందించేందుకు తగు చర్య లు చేపడతానని ఎంపీ రవిచంద్ర హామీనిచ్చారు. ఇందుకు 50వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. కాలేజీ సందర్శ నకు వచ్చిన ఎంపీ రవిచంద్రకు బాలికలు ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి ఆయన డేవిడ్ భోజనం చేశారు. మనఊరు-మనబడిలో భాగంగా తన తల్లిదండ్రులు నారా యణ, వెంకటనర్సమ్మల జ్ఞాపకార్థం కోటి రూపాయలు అం దజేయనున్న హైస్కూలునుఎంపీ వద్దిరాజు సందర్శించారు. ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ నిర్మాణానికి కావలసిన భూమిని ఎంపీ రవి చంద్ర,అదనపు కలెక్టర్ డేవిడ్, తహశీ ల్దార్ దిలావర్,గ్రామ సర్పంచ్ రాంమూర్తి, సింగిల్ విండో చైర్మన్ ధీకొండ వెంకన్న, వద్దిరాజు కిషన్ పరిశీలించారు.